జొన్నలపాడు డోన్ సర్వే పై సమగ్ర కార్యాచరణ

సంతబొమ్మాళి, ఆగష్టు 18, ప్రజా నేత్ర రిపోర్టర్  నాగిరెడ్డి ;
మండలం లోని గోవిందపురం పంచాయతీ జొన్నలపాడు లో పూర్తయిన  డ్రోన్ సర్వే పై గురువారం గ్రామ సభ జరిగింది. పంచాయతీ సర్పంచ్ రెయ్యి రామిరెడ్డి ఆధ్వర్యంలోజరిగిన ఈ గ్రామ సభ లో  డెప్యూటీ  తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ గ్రామస్తులు లకు సర్వే వివరాలు సభలో వివరించారు. దీనిపై రైతులకు ఏమైనా వారి భూములకు సంబందించిన తేడాలు ఉంటే తహసీల్దార్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం లో ఆర్ ఐ చంద్రమౌళి, వీఆర్వో భాస్కరరావు గ్రామ పెద్దలు రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.