జిల్లా అభవృద్ధికి అధికారులు అంకితభావంతో పని చేయాలి.

జయశంకర్ భూపాలపల్లి, ఆగస్ట్ 5; అధికారులు అంకితభావంతో పనిచేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్ర తెలిపారు. శుక్రవారం సాయంత్రం భూపాలపల్లి జిల్లాలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెడికల్ సిబ్బందితో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూపాలపల్లి ఏరియా హాస్పిటల్ నందు టి ఎస్ ఎం ఎస్ ఐ డి సి ఇంజనీరింగ్ అధికారులు బోరులు వేసి వాటికి మోటర్ బిగించకుండా మెడికల్ సిబ్బందికి అసౌకర్యంగా వ్యవహరించినందుకు కలెక్టర్ తెలంగాణ మెడికల్ ఇన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా సమావేశాలకు రాకుండా గైర్ హాజరవుతున్నారని వీరిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ శ్రీరామ్ కలెక్టర్ ఆదేశించారు. సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా మెడికల్ ఆఫీసర్లు తగు చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసరమైతే తప్ప సి సెక్షన్ ఆపరేషన్లు చేయాకూడదనారు క. మాతా శిశుసంరక్షణ సేవల, వ్యాధి నిరోధక టీకాల,క్షయ వ్యాధి నియంత్రణ కార్యక్రమం, క్రిమి కీటకాల ద్వారా వచ్చు వ్యాధులు, ఆస్పత్రిలో జరుగుచున్నటువంటి ప్రసవాల,క్షయ వ్యాధిగ్రస్తులకు అందుతున్నటువంటి పారితోష్కపు వివరాలు సమగ్ర నివేదికను కలెక్టర్ సబ్ సెంటర్ల వారిగా అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీల నమోదు, వారికి అందిస్తున్నటువంటి సేవలు, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం 100% జరగాలని కలెక్టర్ ఆదేశించినారు.జిల్లా నందు గల హాస్టల్స్ ,స్కూల్స్ నందు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ సిబ్బందికి తెలిపారు.అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి అని కలెక్టర్ ఆదేశించారు.నార్మల్ డెలివరీ ని ప్రోత్సహించాలని, సిజేరియన్ ఆపరేషన్ తగ్గించాలని కలెక్టర్ కోరారు. రక్తహీనత కలిగి ఉన్నటువంటి బాలికలను గుర్తించి వారికి ఐసిడిఎస్ ద్వారా ఇప్ప లడ్డు, పల్లి పట్టి ఎటూరి నాగారంలోని ఐటిడిఏ ఆధ్వర్యంలో తయారవుతున్న పోషికాహారాన్ని తెప్పించడం జరిగిందని కలెక్టర్ తెలియజేశారు.ఈ కార్యక్రమములో డాక్టర్ శ్రీరామ్ DMHO, డాక్టర్ కొమురయ్య డిప్యూటీ DMHO, డాక్టర్ శ్రీదేవి PO MCH, డిసిహెచ్ఎస్ సంజీవరావు ,ప్రోగ్రాం అధికారులు, మొదలగు వారు పాల్గొనినారు.

Leave A Reply

Your email address will not be published.