జిల్లాస్థాయి కబడ్డీ పోటీలలో వాణీనికేతన్ కు ద్వితీయ స్థానం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లొని స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా జిల్లాకేంద్రంలో నిర్వహించిన బాలుర కబడ్డీ పోటీలలో వాణీనికేతన్ హైస్కూల్ ద్వితీయ స్థానం సాధించింది. మండలస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వాణీనికేతన్ జట్టు జిల్లాస్థాయి పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబర్చింది. జడ్పీ చైర్ పర్సన్ అరుణారాఘవరెడ్డి, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే, టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావుల చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు నిఖిత్, ప్రణవ్ కుమార్, సిద్దార్థ, సుధీర్, ప్రశాంత్, చరణ్, హర్షవర్దన్, అరుణ్ తదితర క్రీడాకారులను కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనిధిలతో పాటు ఉపాద్యాయులు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.