జాతీయ జెండాను గౌరవించుకుందాం! మధిర సీఐ వడ్డేపల్లి మురళి

దేశమంతా స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు జరుపుకుంటున్న ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించే అవకాశం ప్రభుత్వం కల్పించిందని మధిర సీఐ వడ్డేపల్లి మురళి పేర్కొన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా ఈరోజు నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ జెండాను ఎగరవేసే క్రమంలో కొన్నిచోట్ల అవగాహన రాహిత్యం వలనో, లేదా కట్టిన జెండా పొరపాటున గాలికి కిందపడినా, లేదా కోతులు ఉన్న ప్రాంతంలో కోతులు కింద పడవేసిన చూసినవారు ఫోటో తీసి జాతీయ జెండాకు అవమానం అని దయచేసి గ్రూపులో ఫార్వర్డ్ చేయవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టౌను రూరల్ ఎస్సైలు సతీష్ కుమార్ నరేష్ పాల్గొన్నారు..ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్ గుండ్ల రత్నబాబు

Leave A Reply

Your email address will not be published.