జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రికి టీ డబ్ల్యూ జే ఎఫ్ వినతి

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం సోమయ్య, బసవపున్నయ్యల సహకారం తో ఆదిలాబాద్ ఎం పీ సోయం బాబురావు ఆధ్వర్యంలో టీ డబ్ల్యూ జే ఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు టి సురేందర్ రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నీలి సతీష్, కుమురం భీం అసిఫాబాద్ జిల్లా కార్యదర్శి పర్వతి రాజశేఖర్, కోశాధికారి కృష్ణ మోహన్ గౌడ్ లు కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించారు. జర్నలిస్ట్ ల సంక్షేమార్థం సెంట్రల్ అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని వినతి పత్రం లో పేర్కొన్నారు. కరోనా కు ముందు అమలు లో ఉన్న రైల్వే రాయితీ ని పునరిద్దరించడం తో పాటు రైల్వే ప్రయాణ రాయితీ ని 50 శాతం నుండి వంద శాతానికి పెంచాలని కోరారు. అదే విధంగా జర్నలిస్ట్ కుటుంబంలో ఒక్కరికి ఏడాదిలో రెండు సార్లు మాత్రమే రైల్వే ప్రయాణంలో రాయితీ ఇస్తున్నారని, ఈ పరిమితిని ఎత్తివేసి, ఎన్నిసార్లు ప్రయాణం చేసినా రాయితీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మృతి చెందిన జర్నలిస్ట్ ల కుటుంబాలకు రూ. 20 లక్షల ఎక్స్ గ్రేషియాను కేంద్ర ప్రభుత్వం తరపున ప్రకటించాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి సాధ్యా సాధ్యాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఫెడరేషన్ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు, టీ డబ్ల్యూ జే ఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు టి సురేందర్ రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నీలి సతీష్, కుమురం భీం అసిఫాబాద్ జిల్లా కార్యదర్శి పర్వతి రాజశేఖర్, కోశాధికారి కృష్ణ మోహన్ గౌడ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.