ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

సర్వాయి పాపన్న ఆశయాలు కొనసాగించాలి
— భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
— ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

జయశంకర్ భూపాలపల్లి, ఆగస్ట్ 18;

బహుజనుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు కొనసాగించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సర్వాయి పాపన్న గౌడ్ 372 వ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించగా గురువారం గౌడ సంఘాల ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుండి భారీగా ర్యాలీ తరలివచ్చి ఇల్లందు క్లబ్ హౌస్ లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరయ్యారు. ఈ జయంతి వేడుకలకు ముఖ్య అతిధులుగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి , అడిషనల్ కలెక్టర్ దివాకర, మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు ,ఎక్సైజ్ సుపెరింటెండెంట్ శ్రీనివాస్, ,బిసి సంక్షేమశాఖ జిల్లా అధికారికి టి.శైలజ, గౌడ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పాపన్న చిత్రపటానికి పూలమాలల వేసి ఘననివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ బహుజనుల అభ్యున్నతికి చేసిన పోరాటాన్ని వారు వివరించారు. వారి ఆశలను నెరవేర్చేందుకు వారి అడుగుజాడలు అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ అభివృద్ధి అధికారి శైలజ, డి వై ఎస్ ఓ సునీత, ఎక్సైజ్ సూపర్డెంట్ శ్రీనివాస్ రెడ్డి, డిపిఓ ఆశాలత, డివై డివైసిఎస్ మోటపోతుల శివశంకర్ గౌడ్, బత్తిని శివశంకర్ గౌడ్, బుర్ర రమేష్ గౌడ్ , గౌడ సంఘం రాష్ట్ర , జిల్లా నాయకులు , ప్రజా ప్రతినిధులు, సిబ్బంది, గీత కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.