ఘనంగా తల్లిపాలు వారోత్సవాలు

సంతబొమ్మాళి, ఆగస్టు 8, (ప్రజా నేత్ర):- శ్రీకాకుళం జిల్లాలో సంతబొమ్మాళి మండలంలో రాజపురం అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఐసిడిఎస్ పిఓ శోభారాణి ఆధ్వర్యంలో పిల్లల తల్లులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ తల్లిపాలుడు మించిన ఆహారం మరొకటి లేదన్నారు. పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రుపాలు పట్టించాలన్నారు. తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుందన్నారు. అలాగే అంగన్వాడి కార్యకర్తలతో మాట్లాడుతూ ఏ సెక్టార్లోనైనా లోపాలు కనిపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జలజాక్షి, సర్పంచ్ ప్రతినిధి సావిత్రి, ఎ ఎన్ ఎమ్ లక్ష్మీరాజ్యం, ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.