గద్వాలలో న్యాయవాదుల ధర్నా

ములుగు జిల్లా న్యాయవాది మల్లారెడ్డిని కొందరు దుండగులు హత్య చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ గద్వాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కోర్టు ఎదుట విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు శోభారాణి మాట్లాడుతూ రోజు రోజుకు న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయని వాటిని నిరొదించెంద్జుకు అడ్వకేట్ ప్రొటెక్ట్ యాక్ట్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి మధుసూదన్ బాబు మాట్లాడుతూ న్యాయవాదులు ఐకమత్యంగా ఉండి పోరాటం చేయాలని అన్నారు మల్లారెడ్డిని హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి న్యాయవాదులు రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.