గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్

సంతబొమ్మాళి, ఆగస్టు 19(ప్రజా నేత్ర నాగిరెడ్డి):- సంతబొమ్మాళి సచివాలయం-2 పరిధిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ మేరుగు రాజేశ్వరి అప్పారావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల కరపత్రాలను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటింటికీ పంపిణీ చేసి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటారని తెలిపారు. సంతబొమ్మాళి జడ్పీటీసీ, వైస్ ఎంపీపీలు, పిఎసిఎస్ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైస్ సర్పంచులు, వార్డ్ మెంబర్లు, మండల స్థాయి అధికారులు ,సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తప్పక హాజరు అవ్వాలని ఎంపీపీ కోరారు.

Leave A Reply

Your email address will not be published.