కాగజ్ నగర్ గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఐటీడీఏ పిఓ వరుణ్ రెడ్డి

ప్రజానేత్ర న్యూస్ ,కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, తేది:-03-08-2022

* ఆశ్రమ పాఠశాలలో పరిశుభ్రత పాటించాలి

* ఐటీడీఏ పిఓ వరుణ్ రెడ్డి

* కాగజ్ నగర్ గిరిజన ఆశ్రమ పాఠశాల సందర్శన

గిరిజన ఆశ్రమ పాఠశాలలో పరిశుభ్రత పాటించాలని ఐటీడీఏపీఓ వరుణ్ రెడ్డి సిబ్బందికి సూచించారు. కాగజ్నగర్ కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ఈఎంఆర్ఎస్ లను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల మరుగుదొడ్లు వసతిగృహం వంటగది పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. వర్షాకాలం దోమలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పాఠశాల చుట్టూ మురికి నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. తప్పనిసరిగా పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం వడ్డించాలన్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలిగితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. గిరిజన పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం బోధన పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కొమరం భీమ్ ఆసిఫాబాద్ గారిచే జారిచేయబడినది
ప్రజానేత్ర రిపోర్టర్:తిరుపతి,రెబ్బెన,ఆసిఫాబాద్

Leave A Reply

Your email address will not be published.