ఏపీఎండీసీ నుండి అప్పు ఎగ్గొట్టిన ఐబిసి కంపెనీ,40 కోట్లు , వసూలు చేయాలి! కేసు నమోదు చేయాలి!! సిఐటియు డిమాండ్

గత నాలుగు సంవత్సరాల క్రితం, ఏపీఎండీసీ యాజమాన్యం, ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా,  ఖాళీ చెక్కుల పై 40 కోట్లు విలువ చేసే   బెరైటీస్ రాయి,  ఐ బి సి కంపెనీ, యజమాని బీజేపీ నేత కందుల రాజమోహన్రెడ్డి కి, అప్పు  ఇచ్చారని, సి ఐ టి యు జిల్లా కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్, అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు  సి ఐ టి యు ఆఫీసులో, విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఇన్ని సంవత్సరాల నుండి ఎందుకు  అప్పు బకాయిలు వసూలు చేయలేదు ఏపీఎండీసీ యాజమాన్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.   బయ్యర్స్ కంపెనీల నుండి, ఆస్తులను సెక్యూరిటీ డిపాజిట్ గా ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు. ఖాళీ చెక్కులు పై వ్యాపారం చేయడం ఏమిటని  నిలదీశారు, ఇన్ని సంవత్సరాల చెక్కు బౌన్స్ ఎందుకు చేయలేదు, ఏపీఎండి సి యాజమాన్యం మతలబు ఏమిటని ప్రశ్నించారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు, ఏపీఎండీసీ కార్మికులు సంపాదించిన లాభాలను, ఇష్టానుసారం అప్పులిచ్చి, ఏపీఎండీసీ సంస్థను దివాలా తీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీఎండీసీకి ఐదు మంది  ఎం డి లు  మారిన ,  అప్పు బకాయిలు మాత్రం ఒకరు వసూలు చేయలేదని విమర్శించారు. వచ్చిన  ఎం డి లు, అధికార పార్టీ,  బంధు గణానికి,  బరైటీస్ రాయి  అప్పులిచ్చి, సంస్థను  దివాలా తీస్తున్నారని ఆరోపించారు. ఇదే విధానం కొనసాగితే ఉద్యోగులకు, కార్మికులకు, జీతాలు  ఇచ్చే పరిస్థితి ఉండదని  హెచ్చరించారు. తక్షణం, చెక్ బౌన్స్ చేసి,  ఐ బిసి కంపెనీ పై ఆర్ఆర్ యాక్ట్ ఉపయోగించి, ఆస్తులు జప్తుచేసి  కేసులు నమోదు చేయాలనే డిమాండ్ చేశారు, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కార్మిక నాయకులు లింగాల యానాదయ్య, మండల కన్వీనర్ దాసరి జయచంద్ర పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.