ఏపీఎండిసి అవుట్ సోర్స్ కార్మికులను, పునరావాస యాక్ట్ ప్రకారం రెగ్యులర్ చేయాలని సి ఐ టి యు డిమాండ్!

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం, మంగంపేట ఏపీఎండీస సంస్థలో పని చేస్తున్న, అవుట్ సోర్స్, ట్రైనీ కార్మికులను, పునరావాస యాక్ట్ ప్రకారం, రెగ్యులర్ చేయాలని. ఏపీఎండీసీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్. సిఐటియు అనుబంధం. గౌరవ అధ్యక్షులు సి హెచ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. కట్ట పుట్టాలమ్మ, దేవస్థానం వద్ద, కుప్పాల సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన, ఆఫీస్ బేరర్ ల సమావేశంలో, చంద్రశేఖర్ మాట్లాడుతూ  గనుల తవ్వకాల కోసం, విస్తరణ కోసం, సమస్త అభివృద్ధి కోసం, మంగంపేట గ్రామ ప్రజలు, ఇల్లు, భూములు, డేంజర్ జోన్ కింద అప్ప చెప్పారన్నారు. వారి కుటుంబాలకు శాశ్వతమైన ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా, ఏపీఎండీసీ యాజమాన్యం, అవుట్ సోర్స్,  ట్రైని పేరుతో, ఉద్యోగ అవకాశాలు, కల్పించారన్నారు. 14 సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో వెట్టిచాకిరి చేస్తున్నారని ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం అందరికీ వర్తింపజేయాలని, కొందరికి మాత్రమే పని హోదా వర్తింపజేసి, మిగతా వారికి  డిగ్రీ ఉన్న వారికి ఎంటీఏ1,  డిగ్రీ లేనివారికి ఎం టి ఏ2, అని చెప్పి,  పని హోదా ఇవ్వకపోవడంతో కార్మికులందరికీ అన్యాయం జరిగిందన్నారు. కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలో   సమ్మె ద్వారా,పోరాటం చేసి, మైనింగ్ మంత్రి,  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, కోడూరుశాసనసభ్యులు, కొరముట్ల శ్రీనివాసులు గారు, ఎండి గారు, సమక్షంలో జరిగిన చర్చలకు, కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందానికి ,అగ్రిమెంట్ కు, భిన్నంగా, వేతనాలు  పెంచారని ఆరోపించారు. గత నెలలో 15 ,16 తేదీల్లో, ఎండి దగ్గర  జేఏసీ కార్మిక నాయకులు చర్చలు జరపగా, పని హోదా కల్పిస్తానని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు, పురోగతి లేదన్నారు. పని హోదా కల్పించి, వేతనాలు సరి చేయాలని డిమాండ్ చేశారు, లేకుంటే ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మరోపక్క ఉద్యోగాలు లేవు అంటూనే,  సంస్థకు ఎటువంటి సంబంధం లేని , స్థానికేతరులకు అధికార పార్టీ, రాజకీయ రికమండేషన్ తో, మూడు వందల ఉద్యోగుల పైగా ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా, యాజమాన్య  అక్రమంగా కాంట్రాక్ట్, ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. ఉద్యోగం వచ్చేంతవరకు, డేంజర్ జోన్ కుటుంబాలకు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం మాత్రం సమస్యల పరిష్కారం చేయకుండా, మూడు లక్షల టన్నుల ఉత్పత్తిని, 20 లక్షల టన్నులకు పెంచిందన్నారు. భవిష్యత్తు తరాలకు లేకుండా, మైనింగ్ ను, లాభాల కోసం, లూటీ చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల హక్కుల కోసం సిఐటియు రాజీలేని పోరాటం చేస్తుందని, ఉద్యోగులు కార్మికులు సహకరించాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో, ప్రధాన కార్యదర్శి, నారదాసు, సుబ్బరాయుడు. ఆర్గనైజింగ్ సెక్రటరీ , మర్రి శంకరయ్య,, కోశాధికారి మావిళ్ళ చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు,  హనుమగుండం .శివ శంకర్, గల్లా చలపతి,  ఉప్పర వెంకటరమణ,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.