ఎస్ఐ పోస్టుల రాత పరీక్షకు నిమిషం ఆలస్యమయినా నో ఎంట్రీ ఎస్పి జె. సురేందర్ రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి, ఆగస్ట్ 3 ;ఈ నెల 7న నిర్వహించబోయే ఎస్సై పోస్టుల నియామక ప్రిలిమినరీ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి ఉండదని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు.బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హల్ లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నియమావళి మేరకు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరిండెంట్ లకు, అబ్జర్వర్లకు, పోలీస్ సిబ్బందికి ” అవగాహన కార్యక్రమం” నిర్వహించి పరీక్ష సమయంలో సిబ్బంది మరియు అభ్యర్థులు పాటించవలసిన జాగ్రత్తల గురించి ఎస్పి గారు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎస్పి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మొదటి సారి SI ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతున్నాయని, వీటిని ఛాలెంజ్ గా స్వీకరించి, కట్టుదిట్టంగా నిర్వహించాలని అన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా పరీక్షలకు పగడ్బందీగా నిర్వహించాలని ఎస్పి గారు ఆదేశించారు. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గుర్తింపు కొరకు బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకోవడం జరుగుతుందని, ఇందుకు వీలుగా అభ్యర్థులు పరీక్ష సమయానికి ఒక గంట ముందుగానే (ఉదయం 9 గంటలకు) పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఉదయం 9 గంటల నుండి అభ్యర్థులను పరీక్ష కేంద్రం లోనికి అనుమతించడం జరుగుతుందని సూచించారు. ఉదయం 10 గంటల తర్వాత అభ్యర్థులకు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రం లోనికి అనుమతించరని, అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలను, ఒక్కరోజు ముందుగానే వచ్చి చూసుకోవాలని మరుసటి రోజు పరీక్ష కేంద్రానికి రావడానికి సులువుగా ఉంటుందని అన్నారు. పరీక్షకు సంబంధించిన నిబంధనలు పూర్తిగా హాల్ టికెట్లో పొందపరచి ఉంటాయని, అభ్యర్థులు ఒకటికి రెండుసార్లు హాల్ టికెట్ లోని నిబంధనలు చదువుకోవడం మర్చిపోవద్దని, పరీక్ష హాలు లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులకు అనుమతి ఉండదని, చేతులకు గోరింటాకు , మేహంది వంటివి పెట్టుకోవడం వలన బయోమెట్రిక్ లో వేలిముద్రలు సరిగ్గా వచ్చే అవకాశం ఉండదని, తద్వారా అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంటుందని, ఈ విషయాన్ని గ్రహించి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గోరింటాకు, మెహంది, వంటివి పెట్టుకో రాదని సూచించారు. అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రం లోనికి అనుమతించరనీ, సెల్ ఫోన్లు, వాచ్ లు(చేతి గడియారాలు) మొదలగునవి ఎవరు తీసుకురాకూడదని తెలిపారు. పరీక్షకు సంబంధించిన నిబంధనలు కచ్చితంగా అమలు చేయబడతాయని తెలిపారు. ఎంపిక విధానం పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని అభ్యర్థులు గుర్తించాలని ,ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించే మోసగాళ్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని, అటువంటి మోసగాళ్ల సమాచారం పోలీసులకు తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రిలిమినరీ పరీక్షా పోలీసు నోడల్ అధికారి, అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు కో ఆర్డినేటర్ M.S మూర్తి పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండేట్లు, పరీక్ష అబ్జర్వర్లు,ఇన్పెక్టర్లు, రాజిరెడ్డి, అజయ్, వేణు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.