ఉదయపురం లో పాఠశాల అభివృద్ధి పనులకు భూమి పూజ.

సంతబొమ్మాళి, ప్రజా నేత్ర ఆగష్టు 20 ; సంతబొమ్మాళి మండలం ఉదయపురం గ్రామం లో ప్రాధమిక పాఠశాల అభివృద్ధి పనులకు  శనివారం భూమి పూజ చేశారు. ఈ పాఠశాల అభివృద్ధి కి నాడు నేడు పథకం కింద నిధులు మంజూరు కగా స్థానిక సర్పంచ్ ప్రతినిధి సూరాడ వేంకటేష్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అలాగే ఇదే పంచాయతీ లోని కుముందానువాని పేట లోజల జీవన్ మిషిన్ లో భాగంగా ఇంటింటికి కుళాయి ఏర్పాటుకు నిధులు మంజూరు కాగా వాటిపనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో రట్టి పెరుమాళ్ళు, దేపల్లి కామయ్య, లబ్బ ఈశ్వరరావు, సూరాడ కృష్ణ,కూర్మపు జగం, వంకల జడ్డయ్య, వంకల భాస్కరరావు, సూరాడ తాతరావు,మామిడి రాజారావు,ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.