ఆహారం వికటించి 22 మంది విద్యార్థులకు తీవ్ర అవస్థ

అదిలాబాద్ జిల్లా బేల మండలంలోని కస్తూర్బా విద్యాలయంలో ఆహారం వికటించి దాదాపు 22 మంది విద్యార్థులు తీవ్ర అవస్థకు గురి కావడం జరిగింది.ఈ సందర్భంగా AISF , PDSU,ASU,విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లా విద్యాధికారుల అధికారుల నిర్లక్ష్యం తోనే కేజీబీవీలలో ఇలాంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి గత కొద్ది రోజులుగా జిల్లాలో కేజీబీవీ విద్యాలయాలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. ఈ ఘటనకు బాధ్యులైనటువంటి కేజీబీవీ అధికారులపై శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రతిరోజు ఏదో ఒక పాఠశాలలను సందర్శించాలని విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటు నాణ్యమైన విద్య అందించాలని డిమాండ్ చేయడం జరిగింది . ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు పరామర్శించి మనోధైర్యం ఇవ్వడం జరిగింది విద్యార్థులతో మాట్లాడడానికి అసిస్టెంట్ కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న గారికి పరిస్థితులు వివరించడం జరిగింది వారు కూడా స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఇలాంటి పరిస్థితులు జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మేస్త్రం భాస్కర్ ,పి డి ఎస్ యు అధ్యక్షులు వినోద్ నాయక్, ఏ ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు సలాం వరుణ్ ,ఏఐఎస్ఎఫ్ నాయకులు మడవి గణేష్, గుండాల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.