ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంలో పాలు, బ్రెడ్ అందజేసిన సేవా ఫౌండేషన్ సభ్యులు

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్, తేదీ:11-08-2022 ; ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ హాస్పిటల్ నందు రోగులకు పాలు మరియు బ్రెడ్ ను సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వం ఆజాదిక అమృత్ మహోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలో గల రిమ్స్ హాస్పిటల్ కు ఎంతో మంది పేద ప్రజలు వైద్యం చేయించుకోవడానికి దూర ప్రాంతాల నుండి రావడం జరుగుతుంది అన్నారు. వీరికి తమ వంతుగా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాలు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. తమ సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు సిరాజుద్దీన్, ఫౌండేషన్ సభ్యులు తబ్రేజ్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, అలీమ్, మదీనా మిల్క్ సెంటర్ ఇబ్రహీం పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.