అరటి రైతులకు అవగాహన ఉద్యాన శాఖా అధికారి కళ్యాణి

నంద్యాల జిల్లా : ప్యాపిలి : ఆగస్టు 02 ( ప్రజా నేత్ర న్యూస్) : ఉద్యాన శాఖా అధికారి కళ్యాణి ప్యాపిలి మండలం లోని చండ్రపల్లి గ్రామా రైతు భరోసా కేంద్రంలో అరటి వచ్చే సిగటొక, ఆకుమచ్చ తెగులు లక్షణాలు వాటి నివారణల పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖా అధికారి జి. కళ్యాణి మాట్లాడుతూ సిగటోక ఆకుమచ్చ తెగులు లక్షణాలు, ఆకులపై వర్షకాలంలో సమాంతర చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడుతాయి. అవి క్రమేపి పెరిగి పెద్దవై బూడిద రంగుతో ఉంటాయి. ఈ మచ్చలు గోధమ రంగులోకి మారి పరిమాణంలో పెద్దవై ఒకదానితో ఒకటి కలసిపోతాయి. ఈమచ్చలు ముందుగా క్రింది వరుస ఆకులులో ప్రారంభమై క్రమేణా పైఆకులను ఆశిస్తాయి. తెగులు ఉధృతి పెరిగినప్పుడు మచ్చలు కలసిపోయి ఆకులు మొత్తం ఎండిపోతాయి. కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన పచ్చదనం లేకపోవడం వలన మొక్కలు గెలలు వేసి
నపుడు అవి పక్వానికి రాక ముందే కాయలు పండిపోతాయి. తెగులుకు అనుకూలించే వాతావరణ పరిస్థితులు
ఈ శిలీంధ్రము వర్షాకాలంలో వాతవరణంలో తేమ 90 శాతం కన్నా అధికంగాను ఉష్ణోగ్రత 25 నుండి 28% ఉన్నప్పుడు మరియు ఆకులు 6 నుండి ఉన్నపుడు ఈ తెగులు యొక్క శిలీంధ్రం బీజాలు గాలి ద్వారా మరియు నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి అని తెలిపారు.నివారణ చర్యలు : తెగులు వ్యాప్తి మొదలైనప్పుడు ప్రోపికోనజోల్ 1 మి.లీ. + మినరల్ ఆయిల్ (10 మి.లీ.) లీటరు నీటికి కలిపి ఆకులు మొత్తం బాగా తడిచేలా పిచికారి చేయాలి. ఈ మందును 25 రోజులు వ్యవవధిలో 3సార్లు పిచికారి చేయాలి. తెగులు ఉదృతి అధికంగా ఉన్నపుడు ఈ క్రింద తెలిపిన విధంగా మందులను 5 నుండి 7 సార్లు 25 రోజుల అవసరిని బట్టి పిచికారి చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో వీ హెచ్ ఏ లు వినీత్ కుమార్, సురేంద్ర, చండ్రపల్లి గ్రామ వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సి. యాగంటి రెడ్డి, మరియు చండ్రపల్లి గ్రామ రైతులు. ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు .

🎤 ప్రజా నేత్ర రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.