అజాదికా అమృత్ మహోత్సవం సంధర్భంలో భాగంగా జాతీయ జెండా ఊపి బైక్ ర్యాలీనీ ప్రారంభించిన డా. కొత్తపల్లి శ్రీనివాస్

కొమురం భీంఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరాంగ భారీ బైక్ ర్యాలీలో ముఖ్య అతిథిగా విచ్చేసి ముందుగా శ్రీ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ కొమురం భీం జిల్లా అధ్యక్షులు డా. కొత్తపల్లి శ్రీనివాస్ గారు.జిల్లా కేంద్రంలోని పలు వీధుల గుండా భారీగా ర్యాలీగా నిర్వహించడం జరిగింది అనంతరం vra లు చేస్తున్న నిరవదిక సమ్మెకు మద్దతు తెలిపడం జరిగింది జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్ ఆశయాలను సాదిదాం అన్నారు.అనంతరం జిల్లా అద్యక్షులు డా. కొత్తపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అజాదికా అమృత్ మహోత్సవం సంధర్భంగా భారతదేశం స్వతంత్రం సాధించి 75 సంవత్సారాలు పూర్తిచేసుకున్న సందర్భంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరక ప్రజలందరు ప్రతి ఇంటి మీద, స్కూళ్ళలో, కార్యాలయాల్లో,13,14,15 తేదీలలో జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని మరియు దేశ సమగ్రతను చాటాలని భరత దేశం ఇంకా అభివృద్ధి సాధించాలని ప్రతి ఒక్క భారతీయ పౌరుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జాతీయ జెండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు క్రిష్ణ కుమారి,ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జి ఆత్మారాం నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ గౌడ్,జిల్లా ఉపాధ్యక్షులు గుల్బం చక్రపాణి, విశాల్, రాధికా,జిల్లా కార్యదర్శి బాలకృష్ణ అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్,ఆసిఫాబాద్ తాలుకా కన్వీనర్ సొల్లు లక్ష్మీ, సీనియర్ నాయకులు సతీష్ బాబు, మండల అధ్యక్షులు,జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కొలిపాక కిరణ్, యువమొర్చా జిల్లా అధ్యక్షులు సుచిత్, మహిళా మోర్చ అద్యక్షురాలు కుమురం వందన,శ్రవణ్ గౌడ్, గోలెం తిరుపతి, వెంకట్ గౌడ్, రమేశ్ గౌడ్,శ్రీశైలం వివిధ మండలాల ప్రధాన కార్యదర్శిలు, కార్యదర్శులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.