అంగనవాడి యూనియన్  సి ఐ టి యు ఓబులవారిపల్లె మండలం కమిటీ ఎన్నిక!

అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సి ఐ టి యు అనుబంధం, ఓబులవారిపల్లె మండలం నూతన కమిటీ గా  ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు   సి ఐ టి యు జిల్లా కార్యదర్శి సి హెచ్ చంద్రశేఖర్ ప్రకటించారు. యూనియన్ మండల కమిటీ అధ్యక్షులు గా  ఎన్. రమాదేవి, ప్రధాన కార్యదర్శిగా టి. రాధాకుమారి, ఉపాధ్యక్షులుగా  శ్రీ భాగ్యమ్మ, జి .బేబీ, వై మన్నెమ్మ, బి.వాణి, సహాయ కార్యదర్శులుగా, ఎం శ్యామల, పి. సురేఖ, పి.సుశీల, ఎం .శాంతి, కోశాధికారిగా టీ.ప్రభావతి, మరో 25 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. టీ. సునీత, వరలక్ష్మి, గీత, సుభాషిని ,నాగమణి, విమల ,శంకరమ్మ , శోభ రాణి, లక్ష్మీదేవి, శశికళ. రాణెమ్మ, మల్లీశ్వరి, జరీనా బేగం, శాంతమ్మ, చందన, రుక్మినిమ్మ, శారద. శ్రీదేవి, ఎస్ రమాదేవి, శ్వేత, కె అంజలి, శాంతమ్మ,  తదితరులను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  ఐ సి డి ఎస్ రైల్వేకోడూరు ప్రాజెక్టు, ప్రధాన కార్యదర్శి ఎస్ శ్రీలక్ష్మి పాల్గొన్నారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఐసిడిఎస్ నేను, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేట్ పరం చేయాలని స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పాలని కుట్రపన్నుతోందని దీని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ,కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాడ్యుట్ ,చెల్లించాలన్నారు. ఐదు లక్షలు,రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలన్నారు. సొంత బిల్డింగ్ ల నిర్మించాలన్నారు. 2017 నుంచి టిఎ, డీ ఏ లు చెల్లించాలన్నారు. సూపర్వైజర్ పోస్టులు ప్రమోషన్లో కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వాగ్దానం అమలు చేయాలన్నారు, తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామన్నారు, కానీ ఆంధ్రాలో నాలుగు వేలు తక్కువ ఇస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలి అన్నారు. అంగన్వాడీల ఆందోళన పై పోలీసులను ఉపయోగించడం తీవ్రంగా ఖండించారు.దేశవ్యాప్తంగా సమస్యల పరిష్కారానికి సి ఐ టి యు సమరశీల0గా పోరాటం చేస్తున్న ఏకైక సంఘం అన్నారు. ఐక్యతను కొందరు సంఘ విద్రోహ శక్తులు విచ్ఛిన్నం చేయాలని, కుట్ర పన్నుతున్నారని, అటువంటి వారి పట్ల జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, మండల కార్యదర్శి ఎం జయరామయ్య, రైతు సంఘం నాయకులు, కేశవులు, కెవిపిఎస్ నాయకులు చిన్న ఓబయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.