SPM కార్మికుల సమస్యల పరిష్కారానికై కృషి చేయండి: ఎమ్మెల్యే రఘునందన్ రావు గారిని కోరిన నాయకులు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో భాజపా ఎమ్మెల్యే, ట్రేడ్ యూనియన్ నాయకులు రఘునందన్ రావు గారిని కలిసి SPM కార్మికుల సమస్యలను వివరించిన భాజపా నాయకులు డా. పాల్వాయి హరీష్ బాబు, BMS నాయకులు కల్లోల భట్టాచార్య మరియు SPM ఉద్యోగుల సంప్రదింపుల కమిటీ నాయకులు.*

మూడు ప్రధాన సమస్యలను వారి దృష్టికి తీసుకు రావడం జరిగింది….

1.కంపెనీ పునః ప్రారంభించి నాలుగు సంవత్సరాలు గడిచినా కానీ 190 మంది పర్మినెంట్ ఉద్యోగులను ఇంకా విధుల్లోకి తీసుకోకపోవడం వలన వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలియజేశారు.

2. గత 12 సంవత్సరాలుగా వేతన సవరణ చేపట్టకపోవడంతో స్థానిక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు.

3.అదే సమయాన స్థానికేతరులైన వారికి ఎక్కువ జీతాలిచ్చి ఉపాధి కల్పించడం దారుణమన్నారు.

ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు స్పందిస్తూ ఒకవైపు న్యాయపోరాటం చేస్తూనే ఇంకోవైపు కార్మిక ఉద్యమం చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.SPM కార్మికుల సమస్యల పరిష్కారానికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న SPM ఉద్యోగులు సూర్యప్రకాష్ రావు, శంకరయ్య, లోకేష్, వెంకటేష్ మరియు భాస్కర్ రెడ్డి.

Leave A Reply

Your email address will not be published.