CPI-ML(ప్రజాపంథా) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వెంకట కృష్ణన్నకు నివాళులు అర్పించిన ఆదిలాబాద్ జిల్లా నాయకులు

సిపిఐ-ఎంఎల్ (ప్రజాపంథా) రాష్ట్ర కార్యదర్శికామ్రేడ్ డి.వి.వెంకటకృష్ణ అనారోగ్యంతో చనిపోవడంతో, ఆదిలాబాద్ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ డీ.వీ.కృష్ణ గారికి నివాళులర్పిస్తూ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా CPI-ML (ప్రజాపంథా) జిల్లా నాయకులు జగన్ సింగ్ మాట్లాడుతూ వెంకట కృష్ణ గారు చనిపోవడం అనేది భారత విప్లవోద్యమానికి, పార్టీ కార్మిక వర్గానికి తీరని లోటు అన్నారు. తన జీవితమంతా కార్మికవర్గం అభివృద్ధి కోసం పోరాడిన యోధుడు అని, తను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కృషి చేశారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో IFTU జిల్లా అధ్యక్షులు సుభాష్, ఉపాధ్యక్షులు రాజు, PYL రాష్ట్ర నాయకులు ఆత్రం వినోద్, PDSU జిల్లా కార్యదర్శి హరీష్, PYL జిల్లా అధ్యక్షులు రాథోడ్ సాయి కిరణ్,జిల్లా నాయకులు ఆర్కే సాయి, వినోద్, బాబాన్, దత్తు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.