BMS ఆవిర్భావ దినం సందర్భంగా స్థానిక కృష్ణవేణి చౌరస్తాలో జెండా ను ఎగురవేసిన జిల్లా కన్వీనర్ లక్ష్మి పుత్ర శ్రీనివాస్

జోగులంబా గద్వాల్ జిల్లా ప్రజనేత్ర న్యూస్ ; BMS ఆవిర్భావ దినం సందర్భంగా స్థానిక కృష్ణవేణి చౌరస్తాలో జెండా ను ఎగురవేసిన తర్వాత జిల్లా కన్వీనర్ లక్ష్మి పుత్ర శ్రీనివాస్ మాట్లాడుతూదేశం కోసం పనిచేస్తాం, తగిన వేతనం సాధిస్తాం అనే నినాదం బి.యం.యస్. సొంతం. కార్మికులలో దేశం పట్ల అంకితభావం ఉన్నప్పుడు వారిలో దేశభక్తి నిర్మాణమవుతుంది. దేశం నిలిస్తే కార్మికులు నిలుస్తారు. దేశం పతన మైతే కార్మికులు నిలువలేరు. అందుకే కార్మికులలో దేశభక్తిని నింపి, వారిలో జాతీయతా భావాన్ని పెంపొందించి తద్వారా దేశానికి వారిని అంకితం చేయాలి.1955 జులై23న మధ్యప్రదేశ్ లో, భూపాల్ నగరంలో ఆవిర్భవించిన భారతీయ మజ్దూర్ స০ఘ్, ఈ రోజు నాటికి 67 సం.లు* పూర్తిచేసుకుని 68వ సం.లోనికి అడుగిడుతున్నది. అనేక గుర్తింపు పరిశీలన, ప్రతి పది సంవత్సరముల కొకసారి జరుగును. ఇలా జరిగిన అనేక పరిశీలనలలో మొదటి స్థానంలో నిలబడింది.త్యాగం, తపస్సు మరియు బలిదానం పునాదిగా కార్యకర్తలు నిరంతర అవిరామ కృషితో కొన్ని నిర్దిష్టమైన, విశేషమైన ప్రాధాన్యతలపై ఆధారపడి పురోగమించుట ద్వారా ప్రపంచ కార్మిక లోకాన్ని ఆశ్చర్యంలో ముంచివేసింది. కార్మికుల్లో దేశంపట్ల అంకితభావం ఉన్నప్పుడు మాత్రమే ఆదర్శం అమలవుతుందని గట్టిగా విశ్వసిస్తుంది. కార్మికులలో దెశభక్తిని నింపి జాతిపురోభివృధ్ధికి వారిని సిద్దంజేయడంలో బి.యం.యస్. తనవంతు పాత్ర పోషిస్తుంది. కార్మికుల్లో స్వదేశి, స్వావలంబన, స్వాభిమానం నింపే ఉద్ధేశ్యంతో దత్తోపంత్ ఠ్ంగ్డీజీ బి.యం.యస్. ను ప్రారంభించినారు.ఈ పరిశ్రమ నాది అనుకున్నప్పుడు మాత్రమే కార్మికుడు కష్టించి పనిచేస్తాడు.అందుకే కార్మికులను పరిశ్రమల్లో భాగస్వాములుగా చేయాలని బి.యం.యస్. కోరుతోంది. దేశం పారిశ్రామికీకరణ కాకుండా సంపన్నవంతం కాలేదు. అలాగే కార్మికులకు కొనుగోలు శక్తి లేక తమ అవసరాలను కూడా తీర్చుకొనలేరు. ఫలితంగా దేశంలో దారిద్ర్యం తాండవిస్తుంది. దేశం తనకాళ్ళపై తాను నిలువలేదు. ఇతరుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడి, స్వావలంబన లేక అన్నివిధాలా పతనమవుతుంది. అందుకే దేశం శక్తివంతం కావాలంటే పారిశ్రామికీకరణ జరగాలిప్రజలందరికీ పనిచూపగల సమర్ధవంతమైన పరిశ్రమలతో దేశాన్ని సుసంపన్నం చేయాలి. మనదేశ అవసరాలు తీర్చగల స్వదేశీ సాంకేతికను సంపూర్ణంగా వినియోగం లోనికి తేవటం ద్వారా అత్యధిక సంఖ్యాకులు తో అధికోత్పత్తిని సాధించాలనేది బి.యం.యస్ విధానం అని తెలియజేశారు. ఈ కార్య క్రమం లో జిల్లా కన్వీనర్ లక్ష్మి పుత్ర శ్రీనివాస్ తో పాటు BMS మండల కన్వీనర్ లు కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. జోగులంబా గద్వాల్ జిల్లా ప్రజనేత్ర రిపోర్టర్ బండి కిరణ్ కుమార్(జిల్లా స్టాపర్)

Leave A Reply

Your email address will not be published.