దళిత బంధు లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలి:: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

దళిత బంధు లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలి:: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

130 లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లను పంపిణీ

దళిత బంధు విజయంలో మొదటి లబ్ధిదారులకు కీలక పాత్ర

దళిత బంధు పై వస్తున్న అపోహలను తిప్పి కొట్టాలి

లబ్ధిదారులు లాభదాయక యూనిట్లను ఎంపిక చేసుకోవాలి

వ్యవసాయ మార్కెట్ యార్డులో దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి

పెద్దపల్లి జూలై 29:- దళిత బంధు పథకాన్ని వినియోగించుకుంటూ లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దళిత బంధు లబ్ధిదారులకు సూచించారు. శుక్రవారం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన దళిత బంధు యూనిట్లు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్ పాల్గోన్నారు.సమాజంలో అనేక దశాబ్దాలుగా దళితులు వివక్ష ఎదుర్కొంటున్నారని, వారి అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని మంత్రి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 25% సబ్సిడీ అందించేవారని, తెలంగాణ రాష్ట్రంలో యూనిట్ల వారిగా 60% నుంచి 90% సబ్సిడీ పెంచినప్పటికి బ్యాంకు లింకేజ్ రుణాలు మంజూరు చేసే వారు కాదని మంత్రి పేర్కొన్నారు.దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ఎలాంటి బ్యాంకు లింకేజ్ లేకుండా 100% సబ్సిడీ తో రూ.10 లక్షలు ప్రతి దళిత కుటుంబానికి అందించాలని సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 40 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం అమలు చేసామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 1500 కుటుంబాలకు అమలు చేస్తామని మంత్రి తెలిపారు.దేశ వ్యాప్తంగా దళితుల పరిస్థితి బాగా లేదని, కేవలం సీఎం కేసీఆర్ మాత్రమే చిత్తశుద్ధితో దళిత బంధు లాంటి పథకాన్ని ప్రవేశపెట్టారని, దళిత బంధు విజయం దేశానికి మార్గదర్శకం చేయాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వం అందించే అవకాశాన్ని పూర్తి స్థాయిలో లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.దళిత బంధు లబ్ధిదారులు ఆదాయక యూనిట్లను మాత్రమే ఎంపిక చేసుకోవాలని, అనవసరంగా అధిక సంఖ్యలో వాహనాలు కొనుగోలు చేసి నష్టపోవద్దని మంత్రి సూచించారు దళిత బంధు సహాయం ద్వారా ప్రతి మాసం కనీసం 20 వేలకు పైగా సంపాదించుకునే యూనిట్లను ఎంపిక చేసుకోవాలని మంత్రి సూచించారు.వ్యవసాయ శాఖ ద్వారా సైతం గ్రామాలలో ట్రాక్టర్లు పంపిణీ చేశామని, అధికంగా కార్లు ట్రాక్టర్లు ఉంటే వ్యాపారం సరిగా జరగదని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో వచ్చే దళిత బంధు విడుతలలో వాహనాల యూనిట్లను చాలా మేరకు తగ్గించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పై , దళిత బంధు పథకం పై సమాజంలో రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు సృష్టిస్తున్న అపోహలను లబ్ధిదారులు తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారుకార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ పుట్ట మధు మాట్లాడుతూ దళిత బంధు పథకాన్ని సక్రమంగా వినియోగించుకుంటే జీవితంలో ఉన్నత మార్గానికి ఎదుగువచ్చని జడ్పీ చైర్మన్ తెలిపారు. మంథని నియోజకవర్గంలో రాజకీయాలకతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేసి పథకం అమలు చేస్తున్నామని జెడ్పీ చైర్మన్ పేర్కొన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో 259 మంది లబ్ధిదారులను (ధర్మారం 19, పెద్దపల్లి 100, రామగుండం 100, మంథని 40) ఎంపిక చేసి పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 201 గ్రౌండ్ అయ్యాయని , వాటిలో ఈ రోజు మంత్రి గారి చేతుల మీదుగా 130 యూనిట్లను పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి అమలు చేస్తున్నామని, త్వరలో మరింత మంది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి లలిత బంధు పథకం అమలు చేస్తామని, లబ్ధిదారులు తమ నైపుణ్యాలను వృద్ధి చేసుకునే అంశంపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు.కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ దేశానికే ఆదర్శంగా దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని కొంతమంది విమర్శించారని, ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేనప్పటికీ దళితుల అభ్యున్నతి ధ్యేయంగా చిత్తశుద్ధితో పథకం అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. దళిత బందు యూనిట్లతో ఆర్థికంగా ఎదగాలని, అనవసరంగా వాహనాలు కొనుక్కుని నష్టపోవద్దని ఎమ్మెల్యే సూచించారు .అనంతరం అంతర్గాం మండలానికి చెందిన 50 మంది మహీళలకు 50 వేలు విలువ చేసే కుట్టు మిషన్లను మంత్రి పంపిణీ చేశారుస్థానిక మార్కెట్ యార్డ్ లో మంత్రి ఈరోజు 71 ట్రాక్టర్లు,5 కార్లు, 3 వాహనాలు, 6 ఫోటో స్టూడియోలు, 12 సెంట్రింగ్ యూనిట్స్ , 10 టెంట్ హౌస్ , 3 కిరాణా దుకాణాలు మొదలగు యూనిట్లను మంత్రి పంపిణీ చేశారు.అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, రామగుండం డాక్టర్ అనిల్ కుమార్, పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతారెడ్డి, జిల్ల లోని ఎం.పి.పి. లు, జెడ్పీ టిసి లు, ఈడి ఎస్.సి.కార్పొరేషన్ మాదుసుదన శర్మ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రంగారెడ్డి, ఉపాధి కల్పనా అధికారి తిరుపతి రావు, సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.లక్ష్మి నారాయణ ప్రజానేత్ర న్యూస్ పెద్దపల్లి

Leave A Reply

Your email address will not be published.