స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి – సామాజిక కార్యకర్త తబ్రేజ్ ఖాన్

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్, తేదీ:08-07-2022;ఆదిలాబాద్ జిల్లా కేంద్రం సమీపంలో గల మావల బైపాస్ జాతీయ రహదారి వద్ద వేగా నియంత్రణలు (స్పీడ్ బ్రేకర్లు) ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్త సమాచార హక్కు రక్షణ చట్టం జిల్లా కోశాధికారి తబ్రేజ్ ఖాన్ కోరారు. ఈ సందర్భంగా తబ్రేజ్ ఖాన్ మాట్లాడుతూ మావల బైపాస్ వద్ద ప్రతి నెల క్రమం తప్పకుండా ఏదో ఒక ప్రమాదం జరిగి మరణించడం లేదా గాయపడడం జరుగుతుందన్నారు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం వల్ల జాతీయ రహదారిపై వెళ్లే భారీ వాహనాలు, లారీలు మెల్లగా వెళ్లడం జరుగుతుందని అన్నారు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలను అరికట్టవచ్చు అని ఎంతోమంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడడానికి ఆస్కారం ఉంది కావున స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అధికారులను,ప్రభుత్వాన్ని కోరారు.

Leave A Reply

Your email address will not be published.