సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను, వ్యక్తిగత దూషణలు చేసే వారిపై కఠిన చర్యలు. ఎస్పి జె. సురేందర్ రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి, జూలై 8;సోషల్ మీడియా వేదికగా తప్పుడు పోస్టులు పెడుతూ అసత్య ప్రచారాలు చేస్తూ, విద్వేషాలు కలిగించే విధంగా పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని ,వ్యక్తిగత దూషణలు చేసేవారిపై చట్ట పరమయిన. చర్యలు తప్పవని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి సురేందర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.తమ ఉనికి కోసం ఇతరుల మనోభావాలు , పరువు ప్రతిష్టలు కించపరిచేలా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు , ఫొటోలు , వీడియోలు పెడుతూ, ముందూ వెనుక ఆలోచన చేయకుండా వాటిని వేరేవాళ్లకి షేర్ చేయడం లాంటి చర్యలు తీవ్రంగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో కేసులు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా దుష్ప్రచారాన్ని ప్రోత్సహించే వారిపైనా కేసులు నమోదు చేస్తామని ఎస్పి గారు హెచ్చరించారు. సోషల్ మీడియాలో పోస్టులను వీడియోలను ఇతరుల వ్యాఖ్యలను షేర్ చేసే ముందు ఒక సారి నిర్దారణ చేసుకోవాలని, అది నిజమో కాదో తెలుసుకోవాలని, ఘర్షణలు రేకెత్తించే పోస్టులకు దూరంగా ఉండాలని సూచించారు.జిల్లా పోలీస్ శాఖ అధ్వర్యంలో సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ విభాగం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాపై పర్యవేక్షణ నిర్వహణ ఉంటుదని, ప్రతి ఒక్కరూ ఏదేని పోస్ట్ చేసే ముందు పరిశీలన చేసి పోస్ట్ చేయాలని ఎస్పి సురేందర్ రెడ్డి సూచించారు…..

Leave A Reply

Your email address will not be published.