సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి.

జయశంకర్ భూపాలపల్లి, జూలై 25; ముందస్తు జాగ్రత్తలతో డెంగ్యూ, మలేరియా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, నియంత్రణకు చర్యలు తీసుకోవాలనీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టీ.హరిష్ రావు తెలిపారు.సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ లు, సి.ఎస్ సోమేష్ కుమార్, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవిందు కుమార్, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా నియంత్రణ, పాఠశాలల్లో, హాస్టళ్లలో ఆహార నాణ్యత ప్రమాణాలు, కోవిడ్ పరిస్థితులపై, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై రాష్ట్రంలోనీ జిల్లా కలెక్టర్ లు, అడిషనల్ కలెక్టర్ లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, డెంగ్యూ, మలేరియా కేసులు నమోదు అవుతున్నాయని, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, ప్రతి శుక్రవారం జిల్లాలోని గ్రామాల్లో, ఆదివారం పట్టణాలలో ఇంటింటికి ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని, దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యల పై ప్రజలకు వివరించాలని, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేయాలనీ, డెంగ్యూ, మలేరియా కేసులను ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స చేయడానికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామని, మందులు ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకునే విధంగా ప్రచారం చేయాలని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా విద్యాలయాలు మోడల్ స్కూల్స్ లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందే విధంగా కలెక్టర్లు,ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని, పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం కల్పించాలని, ఆగస్ట్ నాటికి ప్రతి విద్యా సంస్థలో ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహించి 12 నుంచి 17 వయస్సు గల విద్యార్థులకు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని తెలిపారు, మురికి కాలువలు పరిశుభ్రం చేయాలని, మిషన్ భగీరథ ట్యాంకులను శుభ్రం చేయాలని, పైప్ లైన్ లీకేజీలను అరికట్టాలని సూచించారు. గ్రామాలలో ప్రజలు కాచిన నీళ్లు తాగాలని ప్రచారం చేయాలని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వంద శాతం వ్యాక్సినేషన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలనీ, అధికారులు తరచూ వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించాలని, ప్రభుత్వ వసతి గృహాలలో ఉన్న పాత బియ్యం స్టాక్ స్థానంలో నూతనంగా బియ్యం సరఫరా చేస్తున్నామని, వాటిని వినియోగించు కోవాలని సూచించారు. ప్రతి పాఠశాలకు ఒక అధికారికి బాధ్యత అప్పగించి ప్రతివారం ఆకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు.అంతకుముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డెంగ్యూ, మలేరియా జిల్లాల వారీగా ఉన్న కేసులు, తీసుకోవలసిన జాగ్రత్తలు, శాఖలు చేపట్టవలసిన కార్యక్రమాలు, వాక్సినేషన్ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ దివాకర, డిఎంహెచ్వో శ్రీరామ్, డిపిఓ ఆశాలత సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.