సింగరేణి భూమి కబ్జాపై కలక్టర్ ఆగ్రహం కలెక్టర్ భవేష్ మిశ్ర

జయశంకర్ భూపాలపల్లి, జూలై 27; సింగరేణికి కేటాయించిన ప్రభుత్వ భూమిని ఆక్రమణలకు గురి కావడంపై సింగరేణి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్ర. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ నందు సింగరేణి ల్యాండ్ ఎక్కువైజేషన్ పై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లాలో సింగరేణి కేటాయించిన 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాగా అట్టి దానిపై 60 రోజుల క్రితం నివేదిక సమర్పించవలసిందిగా కలెక్టర్ ఆదేశించిన నిర్లక్ష్యం వహించిన సింగరేణి ఎస్టేట్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థకు భూసేకరణ లో భాగంగా భూపాలపల్లి మండలంలోని గడ్డిగానిపల్లి గ్రామంలోని 34 ఎకరాలలో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని పది రోజులలో డిక్లరేషన్ ఇవ్వవలసిందిగా ఆర్డీవోను కలెక్టర్ ఆదేశించారు. గన్పూర్ ములుగు మండలంలోని ధర్మారావుపేట సమీప గ్రామాలలో 508 ఎకరాలలో ప్రభుత్వ భూమి మరియు పట్టా ల్యాండ్ లో సుమారు 400 ఎకరాలకు ల్యాండ్ ఎక్కువైజేషన్ చేయడం జరిగిందని మిగిలిన 10 8 ఎకరాలకు ఉన్న అడ్డంకులను పరిష్కరించి అవార్డు పాస్ చేయవలసిందిగా కలెక్టర్ ఆర్ డి ఓ శ్రీనివాస్ కు ఆదేశించారు. కోండంరాజిరెడ్డిపల్లి గ్రామంలోని 126 రకరాల సర్వే రిపోర్ట్ ఆర్డీవోకు పంపవలసిందిగా కలెక్టర్ తాసిల్దార్ ఆదేశించారు. ధర్మారావుపేటలో ఉన్న 307 ఎకరాల ప్రభుత్వ భూమిపై ఎంక్వయిరీ చేసి రిపోర్టును సమర్పించవలసిందిగా కలెక్టర్ ఆర్డీవోను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జాయింట్ కలెక్టర్ కూరాకుల స్వర్ణలత, సింగరేణి జీఎం సుబ్బారావు, భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్, భూపాలపల్లి తాసిల్దార్ ఇక్బాల్, తాసిల్దారులు, సింగరేణి ఎస్టేట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.