సంఘటితంతోనే సమస్యల పరిష్కారం మోకుదెబ్బ డివిజన్ సదస్సులో జాతీయ అధ్యక్షులు అమర వేణి పిలుపు

నిర్మల్ జిల్లా లోని భైంసా రెవెన్యూ డివిజన్ కేంద్రంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ డివిజన్ సదస్సు జరిగింది.
. ఈసదస్సుకు ముదోల్ మాజీ జెడ్పీటీసీ,ఎంపీపీ,బొల్గం నర్సాగౌడ్, సభాధ్యక్షత వహించారు
. ఈకార్యక్రమానికి ముఖ్య అతితులుగా జాతీయ అధ్యక్షులు అమర వేణి నర్సాగౌడ్, భైంసా మాజీ AMC చైర్మన్ గర్గుల మురళీ గౌడ్, రాష్ట్ర నాయకులు దొర రామ గౌడ్, కొండా గంగాధర్ గౌడ్, జిల్లా అధ్యక్షులు మూల శ్రీదర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు చెపూరి కనకా గౌడ్,తీగెల శ్రీనివాస్ గౌడ్, బాసర PACS చైర్మన్ తీగేల వెంకటేష్ గౌడ్, హాజరై ప్రసంగించారు
. పై నాయకులు మాట్లాడుతూ:- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40,లక్షల గౌడ కులస్థులు సంఘటితంగా ఉండి ఐక్యంగా పోరాడితే హక్కుల సాధనతోపాటు రాజ్యాధికారం సాధన సాధ్యం
అఉతుంది అన్నారు.
. కల్లుగీత కార్పోరేషన్ ను వెంటనే ప్రకటించి 5, వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు, హైదరాబాద్ లో ఆత్మ గౌరవ భవనం నిర్మాణం పనులు వెంఠనే ప్రారంభించాలి అన్నారు, జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును పెట్టాలన్నారు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి సభలను అధికారికంగా నిర్వహించాలి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కోటలను పోరాడిన ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించి అభివృద్ధి చేయాలన్నారు
పై సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
. ఈకార్యక్రమంలో ఆకుల తిరుపతి గౌడ్, ఆకుల దేవేందర్ గౌడ్, కొండా కిష్టా గౌడ్, నక్కల మోహన్ గౌడ్, ఆకుల అంజాగౌడ్, మస్కం అశోక్ గౌడ్, అంబావెని రమేష్ గౌడ్, శ్రీ శైలం గౌడ్ శ్రీనివాస్ గౌడ్, లింగాల క్రిష్ణ గౌడ్, గడ్డం మహేందర్ గౌడ్, బాలరాజ్ గౌడ్ , బిల్లోల్ల శ్రీనివాస్ గౌడ్,ఎర్రోళ్ల స్వామి గౌడ్,లతో పాటు డివిజన్ పరిధిలోని అన్ని మండలాల గ్రమాల గౌడ కులస్తులు,గీత కార్మికులు 300 వరకు పా.
. ఈకార్యక్రమంలో ముందు జ్యోతి ప్రజ్వలన చేసి,గౌడ అమరవీరులకు నివాళులు అర్పించారు. సభకు ప్రారంభానికి ముందు జాతీయ అధ్యక్షులు అమర వేణి నర్సాగౌడ్ ను రాష్ట్ర, జిల్లా నాయకులను ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది.
ఆనంతరం నూతన డివిజన్ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక జరపడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.