వ్యవసాయ కార్మికులకు కూలి బందు, కూలి బీమా, ప్రకటించాలి

వ్యవసాయ కార్మికులకు కూలి బందు, కూలి బీమా, ప్రకటించాలి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ డిమాండ్, మండల నూతన కమిటీ ఎన్నిక, నవతెలంగాణ,ఎర్రుపాలెం, రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు, కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రైతులకు ఏ రీతిగా రైతుబంధు పథకం ద్వారా నగదు జమ చేస్తున్నారో ఆ రీతిగా కూలీలకు కూలి భీమా, కూలి బందు పథకమును ప్రకటించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం మండల ఆరవ మహాసభ మండల కేంద్రమైన ఎర్రుపాలెం కామ్రేడ్ స్వర్గీయ రామిశెట్టి పుల్లయ్య భవనం నందు నాగులవంచ వెంకట్రామయ్య. ఆంగోతు వెంకటేశ్వర్లు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల కు అనుగుణంగా కూలీల రేట్లు పెంచకపోవడం తో కూలీల పరిస్థితులు దిగజారిపోతున్నాయని, ఉపాధిహామీ కూలీల బిల్లులు పడకపోవడంతో పలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. దళిత బందు రాష్ట్రం మొత్తం అమలుపరచాలని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, రేషన్ కార్డులు, 57 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్కరికి నూతన పెన్షన్ నులు వెంటనే ప్రభుత్వం అమలు పరచాలని డిమాండ్ చేశారు. గ్యాస్ పెట్రోలు డీజిల్ నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వాటికి అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. వీటి సాధనకై వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేయనున్నట్లు హెచ్చరించారు. నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక, అనంతరం ఎర్రుపాలెం మండల వ్యవసాయ కార్మిక సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా నాగులవంచ వెంకట్రామయ్య, గామాసు జోగయ్య, వీరితో పాటు కమిటీ సభ్యులుగా షేక్ మున్ని, శేషమ్మ, యశోద, నాగమణి, ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి రాధాకృష్ణ, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య, సర్గుర్తి సంజీవ్ రావు, బేతీ శ్రీను, షేక్ లాల, లగడపాటి అప్పారావు, మోక్ష నంద0, కూఢిల్లీ నాగేశ్వర రావు, రామకృష్ణ, సుబ్బారెడ్డి,ఆవుల వెంకటేశ్వర్లు, మహిళా కూలీలు తదితరులు పాల్గొన్నారు.ప్రజానేత రిపోర్టర్ గుండ్ల రత్నబాబు మధిర

Leave A Reply

Your email address will not be published.