వైసీపీ కార్యకర్తలు నాయకులకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పిలుపు

వైసిపి రాష్ట్ర స్థాయి ప్లీనరీకి తరలిరావాలి.

వైసీపీ కార్యకర్తలు నాయకులకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పిలుపు.

పార్టీని కన్నతల్లి లాగా భావించే ప్రతి ఒక్కరికీ జూలై 8, 9వ తేదీల్లో నిర్వహించే ప్లీనరీ సమావేశాలు పండుగ లాంటివని ఈ పండుగలకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పిలుపు నిచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి ముఖ్యంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మరీ ముఖ్యంగా యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో హాజరై సత్తా చాటాలని కోరారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన కోసం ఏర్పడిన వైసీపీ అనతి కాలంలోనే ప్రజాధరణ చురగొని, దేశంలో చరిత్ర సృష్టించే విధంగా అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే 95 శాతం హామీలు అమలు చేసి సీఎం వైయస్ జగన్ చరిత్ర సృష్టించారన్నారు. భవిష్యత్ కార్యాచరణ రూపుదిద్దటం కోసం గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో జరుగుతున్న రాష్ట్ర ప్లీనరీ విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త గుంటూరుకు తరలిరావాలని మంత్రి పిలుపునిచ్చారు. భారీ ఎత్తున ప్లీనరీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఏం చేశాం.. భవిష్యత్తులో ఏం చేయబోతున్నామనే విషయాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటన చేయనున్నారని తెలిపారు. అన్ని మండలాల ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు, కార్పొరేషన్ల డైరెక్టర్లు, గ్రామ స్థాయి మండల స్థాయి బూత్ కమిటీ సభ్యులు, పార్టీ క్రియాశీలక కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు బాధ్యతగా భావించి తరలి రావాలని ఒక ప్రకటనలో కోరారు.

*******
ప్రజానేత్ర యర్రగొండపాలెం నియోజకవర్గం రిపోర్టర్ :రమణారెడ్డి చిలకల

Leave A Reply

Your email address will not be published.