వి వి కండ్రిక లో గిరిజనులు, దళితులకు  భూములు  ఇవ్వాలని ఎమ్మార్వో ఆఫీస్ వద్ద సిపిఎం ధర్నా!

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు వి వి కండ్రిక గిరిజనులు దళితులకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే,  46ఎకరాలు, భూమిని తక్షణమే పంచాలని, డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ ఆఫీస్ వద్ద,  ధర్నా నిర్వహించడం జరిగినది. సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ధర్నాను ఉద్దేశించి, సి హెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో గత ప్రభుత్వంలోనూ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం లోనూ, అధికార పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూకబ్జాలకు అడ్డూ అదుపూ లేదన్నారు. 8 సంవత్సరాలుగా, అసైన్మెంట్ కమిటీ పెట్టి ఒక ఎకరా కూడా పేదలకు పంచ లేదన్నారు. సిపిఎం పోరాట ఫలితంగా ప్రతిపక్ష జాతీయ పార్టీలకు, స్థానం లేకుండా, జిల్లా స్థాయిలో ఇన్చార్జి మంత్రి ఆధ్వర్యంలో అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని కుట్ర జరుగుతుందని, పాత పద్ధతిలోనే నియోజకవర్గ స్థాయిలో ప్రతిపక్ష జాతీయ గుర్తింపు పొందిన పార్టీలలో సభ్యుల ప్రాతినిధ్యం ఉండేవిధంగా అసైన్మెంట్ కమిటీ ఉండాలని డిమాండ్ చేశారు. లేకపోతే అందరికీ న్యాయం జరగదన్నారు. వి వి కండ్రిక లో, స్థానికులకు, గిరిజనులు దళితులకు, బీసీలకు, అనేకమందికి సెంటు భూమి లేదని,  ఇతర ప్రాంతాల వారు,  బోగస్ పట్టాలు చేసుకొని అనుభవిస్తున్నారని ఆరోపించారు. సర్వే నంబర్ 144 నుండి 152 సర్వేనెంబర్ వరకు, గతంలో  నారాయణ నాయుడు భూములను  రద్దు చేసి ప్రభుత్వ స్వాధీనములో ఉందన్నారు. ప్రతి సంవత్సరము రెవెన్యూ అధికారులు మామిడి తోట కాపు ను వేలం వేసే వారిని, ఈ సారీ, భూకబ్జా దారులతో కుమ్మక్కై,  కనీసం, వేలం నోటీస్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కొందరు ఇప్పటికే ఆ భూమిని ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని తక్షణమే భూకబ్జా అరికట్టాలని, భూమిలేని పేదలకు ఇవ్వాలనే లేకుంటే,  సిపిఎం ఆధ్వర్యంలో భూ పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు.  అనంతరం  తాసిల్దార్ రామ్ మోహన్ గారికి, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లాడుతూ అసైన్మెంట్ లో, కచ్చితంగా భూమిలేని పేదలకు, భూములు ఇస్తామని  హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బొజ్జ శివయ్య, సిఐటియు మండల కన్వీనర్, దాసరి జయచంద్ర. కెవిపిఎస్ నాయకులు, డమ్ము,శివ శంకర్, కృష్ణయ్య, గాలి,హరి, లక్ష్మి దేవి, వెంకటమ్మ,  వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు   నాగి పోగు పెంచలయ్య, కే రమణయ్య,  సి ఐ టి యు నాయకులు మద్దెల ప్రసాద్, మోడీ సుబ్రహ్మణ్యం, ఎస్ఎఫ్ఐ నాయకులు, పి. భరత్ కుమార్.తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.