వరద ప్రాంతాల్లో పర్యటించిన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు.

జయశంకర్ భూపాలపల్లి, జూలై 18.; జయశంకర్ భూపాలపల్లి జిల్లా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు సోమవారం పర్యటించారు. మహాదేవపూర్, రేగొండ మండలాల్లో పీహెచ్ సీ లను సందర్శించి అక్కడ ప్రజలకు అందుతున్న సేవలను, పి.హెచ్.సి పరిశుభ్రతను, సిబ్బంది యొక్క పనితీరుపై సంతృప్తిని వ్యక్తపరిచినారు,జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా ను మర్యాదపూర్వకముగా కలిసి జిల్లా నందు గల వరద ముప్పు గ్రామాల గురించి, సీజనల్ వ్యాధుల గురించి చర్చించడం జరిగినది,కాలేశ్వరం పిహెచ్సి ని సందర్శించిఅక్కడి వైద్యాధికారి,వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి, ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా పరిశుభ్రతను పాటిస్తూ, మెడికల్ క్యాంపులో నిర్వహించాలని ఆదేశించారుఅంబటి పల్లి పి.హెచ్.సి పరిధిలోని సూరారం గ్రామములో నిర్వహిస్తున్నటువంటి వైద్య శిబిరాన్ని తనిఖీ చేసినారు, వైద్య సిబ్బంది అందిస్తున్నటువంటి సేవలపై సంతృప్తి వ్యక్తం చేసినారు అనంతరము పునరావస కేంద్రాన్ని సందర్శించి వారికి పండ్లను పంపిణీ చేసినారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయమును అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ గారు సందర్శించినారు, కాన్పు కొరకుముందస్తుగా ముంపు గ్రామాల గర్భిణీ స్త్రీలను తరలించి అందిస్తున్న సేవలకు హర్షం వ్యక్తం చేసినారుజిల్లా నందు గ్రామాలలో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్ ల గురించి తెలుసుకొని సంతృప్తి తెలియజేసినారుగన్ పూర్ పిహెచ్సి ని సందర్శించి వారు అందిస్తున్న సేవలను, సంతృప్తి వ్యక్తపరిచినారు.ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ శ్రీరామ్, ఎంపీపీ రాణీబాయి, జెడ్పీటీసీ అరుణ, డిప్యూటీ DMHO డాక్టర్ కొమురయ్య, పి ఓ ఎం సి హెచ్ డాక్టర్ శ్రీదేవి, పి ఓNCVBDC డాక్టర్ ఉమాదేవి, DIO డాక్టర్ రవి కుమార్, సి హెచ్ ఓ రాజయ్య,డెమో శ్రీదేవి, DPO చిరంజీవి, జిల్లా ఎపిడమిక్ టీం పాల్గొనారు.

Leave A Reply

Your email address will not be published.