వరదల్లో దెబ్బతిన్న ప్రధాన రహదారులన్నీ వెంటనే మరమ్మతు చేయాలి.కలెక్టర్ భవేష్ మిశ్రా

జయశంకర్ భూపాలపల్లి, జూలై 26; ప్రధాన రహదారులన్నీ ప్రజల సౌకర్యర్దం వెంటనే మరమ్మతులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం భూపాలపల్లి జిల్లాలోని మహా ముత్తారం మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న వేమనపల్లి టు మహా ముత్తారం ప్రధాన రహదారి, కాటారం టు మేడారం ప్రధాన రహదారి కేశపూర్ వద్ద తెగిపోయిన రోడ్డును కలెక్టర్ పరిశీలించారు. వెంటనే రాకపోకలు జరిగేలా తాత్కాలిక మరమ్మత్తు చేపట్టాలని ఆర్ అండ్ బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజా రవాణా సౌకర్యార్థం వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లను ఇంజనీరింగ్ అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం కస్తూరిబా బాలికల పాఠశాల ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. కస్తూరిబా పాఠశాలలో సుమారు రెండు గంటలు కేటాయించి జిల్లా కలెక్టర్ అన్ని సౌకర్యాలను పరిశీలించారు.ప్రతి తరగతి గదిని కలెక్టర్ నిశితంగా పరిశీలించి కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. తొమ్మిదవ తరగతి విద్యార్థులను కలెక్టర్ ఇంగ్లీషు వాచకం నుండి ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. గణితము సైన్స్ సబ్జక్ట్స్ పై కలెక్టర్ స్వయంగా బోర్డుపై రాసి సమాధానాలను విద్యార్థులను అడిగారు. నిర్భయంగా విద్యార్థులు మాట్లాడిన తీరుకు కలెక్టర్ అభినందించారు. కస్తూరిబా పాఠశాలందు కలెక్టర్ తరగతి గదిలోని ఫ్లోరింగ్ కరెంటు గాలి వెలుతురు సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజనాణ్యతను కలెక్టర్ తిని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఎల్ శారద, అగ్రికల్చరల్ జెడి విజయ భాస్కర్, ఎంపీడీవో ఏ రవీంద్రనాథ్, తాసిల్దార్ మాధవి, ఆర్ అండ్ బి అధికారి వెంకటేష్, ఈ ఈపి ఆర్ శేషగిరిరావు, పిఆర్ఏఈ సురేష్, ప్రజా ప్రతినిధులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.