రోడ్డు సౌకర్యం కల్పించాలి – ఏఐఎస్ఎఫ్ నేత గణేష్

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్, తేదీ: 18-07-2022; ఆదిలాబాద్ జిల్లాఇచ్చోడ మండలం బాబ్జిపేట్ గ్రామంలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న ఆ ఊర్లో సరైన రోడ్డు సౌకర్యం లేదు అని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైద్యులు వెళ్లాలంటే సరైన రోడ్డు సౌకర్యం లేదు వెంటనే అధికారులు స్పందించి రోడ్డు మంజూరు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మాడావి గణేష్ డిమాండ్ చేశారు. రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కావున బాబ్జిపేటకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. లేనిపక్షంలో తమ సంఘం అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఐటిడిఏ కార్యాలయం ముట్టడి చేస్తామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.