రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – సిపిఎం నాయకులు దుర్గం దినకర్

ప్రజానేత్ర న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్, తేదీ:13-07-2022 ; కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వలన నీట మునిగిన పంట పొలాలను సీపీఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్బంగా CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్ మాట్లాడుతూ కురుస్తున్న కుంభ సృష్టి వర్షాల వలన రైతులు పంట నష్ట పోయారని, ప్రభుత్వం తక్షణమే పంట నష్టపోయిన పొలాలను సర్వే చేయించి, పంట నష్ట అంచనా వేసి రైతులకు నష్ట పరిహారం అందించాలన్నారు. అంతే కాకుండా పత్తి పంట వేసిన రైతులు వర్షాల వలన పత్తి కొట్టుకోపోవడంతో వారు ఆర్థికంగా తీవ్ర నష్ట పోయారని, ఆ రైతులకు పత్తి విత్తనాలు సబ్సిడీ ద్వారా ఇచ్చి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జాడి తిరుపతి, దుర్గం వాసు, శ్యామ్ రావు మరియు రైతులు వసంత్ రావు, శ్యామ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.