రెవెన్యూ సదస్సుల నిర్వాహణకు సిద్దం చేయాలి.

జయశంకర్ భూపాలపల్లి,జూలై 8;రెవెన్యూ సదస్సుల నిర్వహణకు అధికారులను సన్నద్ధం చేయాలని రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ గారు అన్ని జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ధరణి మాడ్యుల్స్ పై 08.07.22 తేదిన జిల్లా కలెక్టర్ లు, అదనపు కలెక్టర్ లు, సంబందిత అధికారులతో సీఎస్ గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారుధరణి వెబ్ సైట్ లో ఉన్న మాడ్యుల్స్ ను పిపిటి ద్వారా సీఎస్ గారు అధికారులకు వివరించారు. TM 33 మాడ్యుల్ కింద భూ యజమాని పేరు, భూ విస్తీర్ణం, భూమి రకం మార్పులకు దరఖాస్తు అవకాశం కల్పించామని, సదరు దరఖాస్తులలో ఆధారాలను పరిశీలించి, మన దగ్గర అందుబాటులో ఉన్న రికార్డులను తనిఖీ చేసిన అనంతరం నిర్ణయం తీసుకోవాలని సూచించారు.అనంతరం సీఎస్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డులు సమర్థవంతంగా నిర్వహిస్తున్న కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు సిఎస్ అభినందనలు తెలిపారు. మన రాష్ట్రం అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ప్రస్తుతం 95% పైగా భూ రికార్డులు పకడ్బందీగా ఉన్నాయని, మిగిలిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు.సిద్దిపేట జిల్లాలోని ములుగు గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు కింద నిర్వహించడం జరిగిందని, జూలై 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ గారు ఆదేశించారని సీఎస్ పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణ పై చర్చించేందుకు సీఎం కేసీఆర్ గారు జిల్లా కలెక్టర్ లతో జూలై 11న హైదరాబాదులోని ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించడం జరుగుతుందని సిఎస్ గారు తెలిపారు.సీఎం కేసీఆర్ గారి సమీక్ష నాటికి జి.ఓ.58 కింద వచ్చిన దరఖాస్తుల ప్రాథమిక విచారణ ప్రక్రియ 100% పూర్తిచేయాలని కలెక్టర్ లకు సీఎస్ సూచించారు రెవెన్యూ సదస్సుల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 100 బృందాలను రెవెన్యూ ఉన్నతాధికారుల అధ్యక్షతన ఏర్పాటు చేయాలని సిఎస్ గారు సూచించారు.జిల్లాలోని ప్రతి 5 మండలాలకు ఒక బృందం ఏర్పాటు చేయాలని, ప్రతి మండల కేంద్రంలో 3 రోజులకు మించకుండా రెవెన్యూ సదస్సులను మండల కేంద్ర హెడ్ క్వార్టర్ లో నిర్వహించాలని సిఎస్ గారు సూచించారు. రెవెన్యూ సదస్సులను విస్తీర్ణం కలిగిన వేదికల్లో నిర్వహించాలని, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, అవసరమైన కంప్యూటర్లు , ప్రింటర్, జిరాక్స్ మెషిన్ లు, కౌంటర్లు, మొబైల్ మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సి ఎస్ గారు ఆదేశించారు.మండల కేంద్రంలో నిర్వహించే రెవెన్యూ సదస్సులో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొనాలని, దానిని దృష్టిలో ఉంచుకొని రెవెన్యూ సదస్సులో ప్రణాళిక సరిహద్దు జిల్లాల అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని ఖరారు చేయాలని సీఎస్ గారు అధికారులను ఆదేశించారు. మండలాల్లోని గ్రామాలను విభజించి , గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులకు హాజరయ్యే తేదీల షెడ్యూల్ తయారు చేయాలని, రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ పై గ్రామాలలో టాంటాం ద్వారా ప్రచారం చేయాలని, సామాజిక మాధ్యమాల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో షెడ్యూల్ ప్రచురితమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.జూలై 11న సీఎం కేసీఆర్ గారితో జరిగే సమావేశానికి రెవెన్యూ సదస్సుల నిర్వహణ కోసం జిల్లా ప్రణాళికతో హాజరు కావాలని, ఆ ప్రణాళికలో జిల్లాలో ఏర్పాటు చేసే బృందాల వివరాలు, మండల కేంద్రాలలో వేదికలు, షెడ్యూల్ వంటి లాజిస్టిక్స్ వివరాలు సిద్ధం చేయాలని సి ఎస్ గారు ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల సమయంలో వచ్చిన దరఖాస్తులను 100% అర్హత మేరకు పరిష్కరించాలని, కోర్టు కేసులు, కుటుంబ తగాదాలు, సరైన డాక్యుమెంట్లు సమర్పించని కేసుల వివరాలతో కూడిన సమాధానం వారికి అందజేయాలని సిఎస్ సూచించారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ గురుకుల పాఠశాలలు మంజూరు చేసిన ప్రాంతాల్లో ఉండేవిధంగా కలెక్టర్ లు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ గారు సూచించారని సిఎస్ పేర్కొన్నారు.ప్రతి జిల్లాలో ఆగస్టు 15 నాటికి బీసి, ఎస్సీ స్టడీ సర్కిల్లో ఏర్పాటుకు సంబంధించి అవసరమైన స్థలాలు, భవనాలను ఎంపిక చేయాలని సిఎస్ కలెక్టర్లకు ఆదేశించారు జిల్లాలో చేపడుతున్న హరితహారం కార్యక్రమం, గ్రామీణ క్రీడ ప్రాంగణాల పురోగతి వివరాలు సైతం తయారు చేయాలని కలెక్టర్ లకు సీఎస్ గారు సూచించారు.వీడియో కాన్సెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 11 మండలాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ కోసం 3 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, 15 రోజుల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ దివాకర జాయింట్ కలెక్టర్ స్వర్ణలత ఆర్డిఓ శ్రీనివాస్ జిల్లాలోని 11మండలాల తాసిల్దార్లు పాల్గొన్నారు…..

Leave A Reply

Your email address will not be published.