రిమ్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్, తేదీ:01-07-2022; ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో AITUC తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్& ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కన్నల లక్ష్మీ ఆధ్వర్యంలో ప్రెస్ మిట్ ఏర్పాటు చేయడం జరిగింది. సంఘం రాష్ట్ర కార్యదర్శి సిర్ర దేవేందర్ మాట్లాడుతూ రిమ్స్ డైరెక్టర్ వెంటనే రిమ్స్ లో పనిచేస్తున్న శానిటేషన్, పేసేంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్ కార్మికుల పాత,కొత్త కాంట్రాక్టర్లను మరియు కార్మికుల మధ్య మీటింగ్ ఏర్పాటు చేసి పాత కాంట్రాక్ట్ స్పార్క్ ఏజెన్సీ నుండి PF, ESI క్లియర్ చేసినరా లేరా అని తెలుసుకొని కార్మికులకు న్యాయం చేయాలని మరియు కొత్త కాంట్రాక్ట్ ఏజెన్సీ వారికి మరియు కార్మికులకు మధ్యన మీటింగ్ ఏర్పాటు చేసి ఏ ప్రాతిపదికన చేపట్టినరో కాంట్రాక్ట్ నియమ నిబంధనలు ఏమిటీ అన్నది రిమ్స్ డైరెక్టర్ సమక్షంలో తెలియచేసి GO 21 ని అమలు చేసి కార్మికులకు 21 నుండి 24 వేల వేతనాలు చెల్లించాలని కొత్త కార్మికులకు పండుగ ఆర్జిత సెలవులు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రుక్మిణి, D రాధ, E శ్రీనివాస్, M లక్ష్మీ, అన్నపూర్ణ, కస్మాక్క, పుష్పలత, గంగు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.