రంగు రంగుల లైటింగ్‌తో అలంకరణ

గద్వాల్ రైల్వే జంక్షన్ : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ ( స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా)లో భాగంగా భారతీయ రైల్వే “ఆజాదీ కి రైల్‌గాడి ఔర్ స్టేషన్ల” వేడుకలను నిర్వహిస్తున్నది. ఈ వేడుకల కోసం దేశంలో 75 స్టేషన్లు గుర్తించగా అందులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గద్వాల, నాంపల్లి (హైదరాబాదు), విజయవాడ, గుంటూరు స్టేషన్లకు స్థానం లభించింది. కార్యక్రమంలో భాగంగా హైదరాబాదు డివిజన్ వారు ఈ రోజు సాయంత్రం గద్వాల రైల్వే జంక్షన్ లో వేడుకలను నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లాలో రైల్వే ప్రగతిని వివరిస్తూ, స్వతంత్ర సమరయోధుల కుటుంబసభ్యులను సన్మానించ బోతున్నారు.

Leave A Reply

Your email address will not be published.