యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలి – జన శిక్షణ సంస్థ డైరెక్టర్ శ్యామల

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్, తేదీ:15-07-2022; ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవాన్ని జన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ శ్యామల మాట్లాడుతూ యువత ప్రతి వృత్తిలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలో జన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్, బ్యూటిషన్, కంప్యూటర్, ఎంబ్రాయిడరీ ఉచిత శిక్షణలు నేర్చుకుంటున్న మహిళలతో సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇచ్చోడ మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న యువతీ యువకులకు 12 రకాల కోర్సులపై వృత్తి నైపుణ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జన శిక్షణ సంస్థ ద్వారా ఉచిత శిక్షణలో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గతంలో టైలరింగ్, బ్యూటీషియన్ నేర్చుకున్న మహిళలు సొంతంగా నేర్చుకున్న వృత్తిని కొనసాగిస్తూ కుటుంబానికీ బాసటగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ చెన్నల రాజన్న, వర్ని సంతోష్, ఫీల్డ్ ఆఫీసర్ రాజు, నరేందర్, టీచర్లు స్వప్న, సంగీత, అలకనంద, అంజం, శాహీన తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.