మానవత్వం చాటుకున్న ఎస్సై మామిడి మహేందర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కిష్టారావుపల్లి గ్రామానికి చెందిన జక్కుల సత్తయ్య-లింగవ్వ, కవ్వంపల్లి దుర్గవ్వ-బాలయ్య అనే దంపతులు వృద్దాప్యంలో లేవలేని పరిస్థితి లో ఉన్నారు. వాళ్ళు నివలించే ఇండ్లు కూలిపోయే పరిస్థితి లో ఉండగా విషయం తెలుసుకున్న ఎస్సై మామిడి మహేందర్ పోలీసు సిబ్బంది తో వెళ్లి ఆ వృద్ధ దంపతుల ఇళ్లను పరిశీలించి కూలిపోయే పరిస్థితి ఉండటం, వారికి సంతానం లేనందున చలించిపోయిన ఎస్సై నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులను ఎస్సై,తన సిబ్బంది మధు కానిస్టేబుల్ తో కలిసి భుజాలపై ఎత్తుకుని వెళ్లి తన వాహనంలో తీసుకెళ్లి వెంటనే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో తాత్కాలికంగా కరెంటు ఏర్పాటు చేసి నివాసం కల్పించారు. ఎస్సై తన సొంత ఖర్చుతో నిత్యావసర సరుకులు, కొంత డబ్బులను సాయంగా అందజేశారు. వారికి మంచినీటి సదుపాయం కల్పించారు.

 

Leave A Reply

Your email address will not be published.