మండల టాస్క్ పోర్స్ సమావేశం.

జయశంకర్ భూపాలపల్లి, జూలై 12 ;జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళ వారం బి. రాణి బాయ్ రామారావు గారి అధ్యక్షతన మండల, గ్రామ పంచాయతీల టాస్క్ ఫోర్స్ టీములతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించబడినది. ఇట్టి సమావేశములో ముఖ్య అతిథిగా మండల ప్రత్యేక అధికారి శోభారాణి జెడ్పి సీఈవో హాజరై మాట్లాడుతూ ఇంకనూ మూడు రోజులు అనగా 15. 7. 2022 వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు మరియు ప్రజాప్రతినిధులు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ మహదేవపూర్ మండల పరిధిలోనిగోదావరి నది తీర ప్రాంతం వెంబడి ఉన్న లోతట్టు గ్రామాలలో అధిక వర్షం వలన జలమయం అయ్యే అవకాశం ఉన్నందున అట్టి గ్రామాలలో నివాసం ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించుటకు సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శులు మరియు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని ఎలాంటి ప్రాణ, ఆర్థిక నష్టం జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించినారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఉన్న మండల తహసిల్దార్ మరియు ఎంపీడీవో గారలు అందుబాటులో ఉంటారని ఎవరు కూడా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆదేశించినారు. మరియు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కూడా ప్రజలకు వైద్య చికిత్స అందించుటకు గాను పునరావాస కేంద్రాలలో మందులతో సిద్ధంగా ఉండాలని ఆదేశించినారు. పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు త్రాగునీరు, ఆహారం వంటి సదుపాయాలు రెవెన్యూ వారు ఏర్పాట్లు చేయాలని ఆదేశించినారు.ఇట్టి సమావేశంనకు డిప్యూటీ తాసిల్దార్ మహదేవపూర్ గారు, ఎం. శంకర్ ఎంపీడీవో మహదేవపూర్ గారు, మండల పంచాయతీ అధికారి ప్రసాద్ గారు, మెడికల్ ఆఫీసర్, ఎస్సై రాజ్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, డి.ఈ సాయిలు, ఏ.ఇ పంచాయతీ రాజ్ , ఏ.ఇ ఆర్డబ్ల్యూఎస్, సమస్త గ్రామపంచాయతీల కార్యదర్శిలు, తదితరులు హాజరు అయినారు.

Leave A Reply

Your email address will not be published.