భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి.

జయశంకర్ భూపాలపల్లి, జూలై 9

జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు, ప్రమాదాల భారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాలలో పాత ఇండ్లు, శిథిలావస్థలో ఉండే నివాసాలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే గోదావరి, మానెరు నది తీర గ్రామాలలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తమ పిల్లలను నదులలోకి, వాగుల వద్దకి వెళ్లకుండా చూడాలని, వాగులు వంకలలో కూడా నీటి ప్రవాహాలు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలలో అప్రమతంగా ఉండాలని అన్నారు. వర్షాల దృష్ట్యా పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిల్లా ఎస్పీ గారు పోలీస్ అధికారులను ఆదేశించారు. స్ధానిక పోలీసులు తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్లు, గ్రామాలు, జలమయమయ్యే ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో వుంటూ, ఎటువంటి ఆటంకాలు కలగకుండా తక్షణమే పర్యవేక్షించి ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ఆవకాశం ఉంటుదని కాబట్టి రోడ్డు రవాణా, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా విధ్యుత్, రెవెన్యూ, ఆర్ & బీ శాఖ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. రెండు రోజులు పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రజల అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు, ఏమైనా సంఘటనలు జరిగితే స్థానిక పోలీసులకు గానీ లేదా డయల్ 100 సమాచారం అందించాలని, తక్షణ సహాయక రక్షణ చర్యలు చేపడుతామని ఎస్పి జె. సురేందర్ రెడ్డి తెలిపారు…..

Leave A Reply

Your email address will not be published.