బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యం గా ముందుకు సాగాలి. ఛత్తీస్ గడ్ మాజీ మంత్రికురుద్ శాసనసభ్యులు అజయ్ చంద్రకర్

బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యం గా ముందుకు సాగాలి…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి భారీ బహిరంగ సభను విజవంతం చేద్దాం..

ఛత్తీస్ గడ్ మాజీ మంత్రి, కురుద్ శాసనసభ్యులు అజయ్ చంద్రకర్...

జయశంకర్ భూపాలపల్లి, జులై 01; తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్న సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి భారీ బహిరంగ సభను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 119 స్థానాలలో జాతీయస్థాయి నాయకులను ఇన్చార్జిలుగా తెలంగాణ రాష్ట్రానికి పంపడం జరిగింది అందులో భాగంగా మంథని నియోజక వర్గానికి అజయ్ చెంద్రకర్ గారు చతిస్గడ్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు, కాటారం మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన శక్తి కేంద్రంల, బూత్ అధ్యక్షులు, మోర్చా ల సమావేశని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ

కేంద్ర ప్రభుత్వ పథకాలను కేసీఆర్ సర్కారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందకుండా చేస్తుందని ప్రతి ఇంటికి నీటి, విద్యుత్ సరఫరా, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఇలా ఎన్నో పథకాలు అందజేస్తూ స్వచ్ఛభారత్ పేరుతో మరుగుదొడ్లు,స్మశాన వాటికల నిర్మాణం లాంటివి ఎన్నో చేపడుతుంది కానీ ఈ పూర్తి స్థాయిలో ఫలాలు అందకుండా కేసీఆర్ సర్కార్ మధ్యలో అడ్డుపడుతూ కలెక్షన్ కు మారుపేరుగా నిలుస్తున్నారు అగ్నిపత్ విషయంలో ఎటువంటి అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు అనవసరమైన గొడవలు పెడుతున్నారు రానున్న రోజుల్లో బిజెపిని బలోపేతం చేసి రాష్ట్రంలో మరియు మంథని గడ్డ పైన కాషాయం జండా ఎగరవేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తుంది. తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో జరిగిన అక్రమాలు కేసీఆర్ కరప్షన్ కు నిదర్శనం ఆర్ఎన్ఆర్ ప్యాకేజీల విషయంలో కాంగ్రెస్, తెరాస ప్రభుత్వాలు కుమ్మక్కై ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు కాలేశ్వరం బ్యాక్ వాటర్ మూలంగా ఎంతో మంది రైతులు నష్టపోతున్నారు వీటన్నిటికీ పరిష్కారం బిజెపి ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది అన్నారు
కాళేశ్వరం, సుందిళ్ల, అన్నారం బ్యాక్‌ వాటర్‌ వల్ల అనేక ఎకరాల వ్యవసాయ భూములు అస్తవ్యస్తం కావడం, వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి రైతులకు వచ్చిందని నష్టపరిహారం కూడా అందించకపోవడం సిగ్గు చేటన్నారు తాడిచర్ల ఏఎంఆర్ మైనింగ్ కంపెనీతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు రాజీపడి టెండర్ల వాల్యుయేషన్‌లో చాలా అవినీతి జరిపిందని వారన్నారు మంథని నియోజకవర్గ యువతను రెచ్చగొడుతూ అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా స్థానిక ఎమ్మెల్యే ఇటీవల సత్యాగ్రహ దీక్ష చేయడం విడ్డూరం అని అన్నారు ఈ కార్యక్రమంలో మంథని నియోజకవర్గ శక్తి కేంద్రాల ఇంచార్జ్ కొండాపురం జగన్ గారు , బీజేపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునిల్ రెడ్డి, కాటారం మండలల అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి, పిలుమారి సంపత్, మల్కామోహన్ రావు జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ జగన్ నాయక్ జిల్లా కోశాధికారి దుర్గం తిరుపతి చింతకాని ఎంపీటీసీ ఉడుముల విజయ రెడ్డి జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి పాగేరంజిత్ కుమార్ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి బండం మల్లారెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి సకినారం శ్రీహరి మండల ప్రధాన కార్యదర్శి గంట అంకయ్య పూసల రాజేంద్రప్రసాద్ కాటారం పట్టణ అధ్యక్షుడు కొండ రాజమల్లు శక్తి కేంద్ర ఇన్చార్జులు బూత్ కమిటీ అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.