ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ సద్వినియోగం చేసుకోవాలి- అవర్ ఫుడ్ సంస్థ జిల్లా అధికారి తాళ్లపల్లి కిషన్

ప్రజానేత్ర న్యూస్, నిర్మల్, తేదీ:27-07-2022 ; నిర్మల్ జిల్లాలో గల రైతులు, యువకులు, నిరుద్యోగులు మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలని అవర్ ఫుడ్ సంస్థ నిర్మల్ జిల్లా అధికారి కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా నర్సాపూర్ మండల కేంద్రంలో కిషన్ గారు మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో స్వయం ఉపాధి పొందవచ్చు అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అవర్ ఫుడ్ సంస్థతో గతంలోనే ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. అవర్ ఫుడ్ సంస్థ ద్వారా పప్పు మిల్లు (కందులు,శనిగలు, పెసర, మినుములు), పసుపు మిల్లు, మిర్చి మిల్లు, చిరుధాన్యాల మిల్లు, రైస్ మిల్లు, పల్లి గానుగ నూనె యూనిట్స్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఎస్బిఐ బ్యాంకు సహకారంతో మిషనరీ కొరకు, వర్కింగ్ క్యాపిటల్ కొరకు బ్యాంకు లోన్ ఇప్పించడం జరుగుతుందన్నారు. అవర్ ఫుడ్ సంస్థ ద్వారానే టెక్నికల్ సపోర్ట్, రవాణా, మార్కెటింగ్, సర్వీసింగ్ సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గలవారు 9701849569 నెంబర్ కు సంప్రదించాలని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.