ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ సద్వినియోగం చేసుకోవాలి- అవర్ ఫుడ్ సంస్థ జిల్లా అధికారి కొండగుర్ల కమలాకర్

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్, తేదీ:23-07-2022 ; ఆదిలాబాద్ జిల్లాలో గల రైతులు, యువకులు, నిరుద్యోగులు మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలని అవర్ ఫుడ్ సంస్థ ఆదిలాబాద్ జిల్లా అధికారి కొండగుర్ల కమలాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో స్వయం ఉపాధి పొందవచ్చు అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అవర్ ఫుడ్ సంస్థతో గతంలోనే ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. అవర్ ఫుడ్ సంస్థ ద్వారా పప్పు మిల్లు (కందులు,శనిగలు, పెసర, మినుములు), పసుపు మిల్లు, మిర్చి మిల్లు, చిరుధాన్యాల మిల్లు, రైస్ మిల్లు, పల్లి గానుగ నూనె యూనిట్స్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఎస్బిఐ బ్యాంకు సహకారంతో మిషనరీ కొరకు, వర్కింగ్ క్యాపిటల్ కొరకు బ్యాంక్ నుండి రుణం ఇప్పించడం జరుగుతుందన్నారు. అవర్ ఫుడ్ సంస్థ ద్వారానే టెక్నికల్ సపోర్ట్, రవాణా, మార్కెటింగ్, సర్వీసింగ్ సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గలవారు 9866776081 నెంబర్ కు సంప్రదించాలని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.