ప్రభుత్వ పాఠశాలల్లో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. AISF

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్, తేదీ:06-07-2022;అఖిలభారత విద్యార్థి సమైక్య (AISF) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో DEO కార్యలయం ఎదుట నిరసన చేపట్టారు. ఆనంతరం విద్యార్థులతో కలిసి DEO గారికి వినతి పత్రం అందించారు.ఈ సంధర్భంగా AISF జిల్లా కార్యదర్శి మేస్రం భాస్కర్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
డిమాండ్స్ :
1.ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌళిక సదుపాయాలు కల్పించి ఖాళీగా వున్న పోస్టులు, MEO పోస్టులు వెంటనే భర్తీ చేయాలి.
2. ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేయాలి.
3. ప్రతి పాఠశాలలో స్వచ్ఛ కార్మికులను నియమించాలి.
4.మధ్యాహ్న భోజననికి నిధులు పెంచి నాణ్యమైన భోజనం అందించాలి.
5.మన ఊరు – మన బడిలో అన్ని పాఠశాలలను చేర్చి అభివృద్ధి చేయాలి.
6. కార్పోరేట్ విద్యాసంస్థలను రద్దు చేయాలి.
7. అధిక ఫీజుల దోపిడిని అరికట్టి G.O.Ms. No. 42 ను అమలు చేసి ఫీజు నియంత్రణ కమిటీ (DFRC)ని ఏర్పాటు చేసి ఫీజు నియంత్రణ చట్టంను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో AISF జిల్లా నాయకులు మడావి గణేష్, గేడాం కేశవ్, దత్తు, నవీన్, తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.