ప్రజా సమస్యల పరిష్కారానికి , 11 న  రాయచోటి కలెక్టరేట్ వద్ద ధర్నా జయప్రదం చేయండి! సిపిఎం పిలుపు!!

జనం కోసం సిపిఎం, ప్రజా సమస్యలు పరిష్కరించాలని, జూలై 11 సోమవారం ఉదయం 10 గంటలకు అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద, మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు, జయప్రదం చేయాలని, సిపిఎం పార్టీ అన్నమయ్య జిల్లా నాయకులు సి హెచ్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. రైల్వే కోడూర్, సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ, ప్రజల పైన భారాలు మోపుతూ, స్థానిక సమస్యలు పరిష్కారం చేయడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్న అందుకు నిరసనగా ఆందోళన జరుగుతుందన్నారు. పెట్రోలు డీజిల్ ,గ్యాస్, విద్యుత్తు,ఆర్టీసీ, చార్జీలు భారీగా పెంచారని, మరోపక్క ఆస్తిపన్ను, వాహనాల టాక్సీ విపరీతంగా పెంచారు. సంక్షేమ పథకాలు కోత విధిస్తున్నారని, గ్రామాల్లో కనీసం వీధిలైట్లు వేసినందుకు నిధులు లేవన్నారు. ఇంటి స్థలాలు, భూములు, ఇవ్వాలని, పక్కా గృహాలు ప్రభుత్వం కట్టించి ఇవ్వాలని, భూకబ్జాలు అరికట్టాలని, పాఠశాలల విలీనం, ఉపసంహరించుకోవాలని, రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడం రద్దు చేయాలన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, కేంద్రం విభజన చట్టం హామీలు అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగం రెగ్యులర్ చేయాలని, సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు, కనీస వేతనం 600 ఇవ్వాలన్నారు, 200 పని దినాలు కల్పించాలన్నారు. సంక్షేమం పేరుతో అభివృద్ధి కుంటుపడింది అన్నారు, గాలేరు-నగరి, హంద్రీ నీవా, ప్రాజెక్టు పనులు ప్రస్తావనే లేదన్నారు. కడప ఉక్కు పరిశ్రమ, ఏర్పాటు చేయాలని, మంగంపేట బరైటీస్ మీల్లులు తెరిపించి ఉపాధి కల్పించాలన్నారు. ఖాళీ పోస్టుల భర్తీ చేసి నిరుద్యోగ సమస్య తీర్చాలని డిమాండ్ చేశారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని, సచివాలయం, ఎమ్మార్వో ఆఫీస్ లవద్దా, ఆందోళన చేసిన పట్టించుకోలేదన్నారు. అందుకే సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు, అర్జీ దారులు బాధితులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్, లింగాల యానాదయ్య, మండల నాయకులు కర్రతోటి హరినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.