పాఠశాలల విలీనాన్ని ఆపాలి యుటిఎఫ్

ప్యాపిలి 15 జులై (ప్రజా నేత్ర న్యూస్) : ప్రభుత్వ పాఠశాలల విలీనం పేరుతో నిరుపేద విద్యార్థులకు విద్య దూరం అయ్యే ప్రమాదం ఉందని కావున విలీన ప్రక్రియను తక్షణమే ఆపాలని యుటిఎఫ్ జిల్లా కోశాధికారి నరసింహారెడ్డి, యుటిఎఫ్ మండల అధ్యక్షులు సర్వజ్ఞ మూర్తి,జిల్లా నాయకులు అబ్దుల్ లతీఫ్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.వారు మాట్లాడుతూ జిఓ నంబరు 117 ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.117 జిఓ నందు సవరణలు చేస్తామని చెప్పి 128 జిఓ విడుదల చేయడం సరికాదన్నారు.రాష్ట్రంలో 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇప్పుడు ఇచ్చిన సవరణ ఉత్తర్వుల వల్ల మరో 20 వేల పోస్టులు మిగులుగా మారనున్నాయని,దీనివల్ల విద్యారంగానికి నష్టం తప్ప ప్రయోజనం లేదని పేర్కొన్నారు.ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన చర్చలలో ఇచ్చిన హామీలకు భిన్నంగా సర్దుబాటు సవరణ ఉత్తర్వులు ఇచ్చారని పేర్కొన్నారు.పాఠశాలల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 17 వ తేదీన విజయవాడ లోని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర స్థాయి సదస్సు కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు,కార్యకర్తలు,ఉపాధ్యాయులు,విద్యా రంగ శ్రేయోభిలాషులు,మేధావులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.

🎤 ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.