పశువైద్యాధికారి మీరాకు సన్మానం

పుల్లల చెరువు మండలం :ప్రజలకు మంచి సేవలందించే అధికారులకు ఎల్లప్పుడు గౌరవం లభిస్తుందని గ్రామ ప్రజలు అన్నారు. పుల్లల చెరువు కు బదిలీ పై వెళ్తున్న నాయుడుపాలెం పశువైద్యాధికారి డాక్టర్ నాగులు మీరాను సోమవారం పిరికిటివారి పల్లె సచివాలయ ఉద్యోగులు, పశుసంవర్ధక శాఖ సంచాలకులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఐదేళ్ళపాటు మీరా ఉత్తమ సేవలందించారని గ్రామస్థులు కొనియాడారు. అనంతరం దుశ్శాలువతో మీరాను పశుసంవర్ధక శాఖ సంచాలకులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, సర్పంచులు, పాల్గొన్నారు

ప్రజానేత్ర యర్రగొండపాలెం నియోజకవర్గం
రిపోర్టర్ :రమణారెడ్డి చిలకల

Leave A Reply

Your email address will not be published.