పరారైన దొంగ బాబా పలికీల.రాము

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలము పోతు నాయుడు పేట గ్రామానికి చెందిన పలికిల. రాము అలియాస్ (రెయ్యమ్మ. దాసుడు) అని పిలవబడి గత 10 సం లుగా నేనొక అమ్మవారి స్వప్నాన్ని అని,నా ఇంటి బొట్టు ప్రతీ ఇంటి తోరణమని అంటూ … తన గురువు పంపిన భక్తులను వసపరుచుకొని రానురాను ప్రజల్లో ముదనమ్మకాలును నమ్ముతున్న వారిని ఆసరాగా తీసుకుని ప్రజలను మోసం చేస్తూ కోట్లు సొమ్ముసంపాదించాడు. దీనికి స్థానిక రెవెన్యూ, పోలీస్ వారు నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నారని స్థానికుల చెప్తున్నారు. అమాయక ప్రజలను మోసం చేయడమే కాకుండా, కొంతమంది జీవితాలతో కూడా ఆడుకుంటున్నారుఅని కొంతమంది బాధిత మహిళలు చెపుతున్నారు. మాలో బయన్ని ఆసరాగా తీసుకుని మాకు లేనిపోని సందేహాలు పుట్టించి మా బలహీనతలు ను అతను సొమ్ము చేసుకుంటున్నాడు. అని చెప్తున్నారు. ఇదంతా కాదు అసలు ఆయన ఏ స్టేజ్ లో ఉండే వాడు ఇప్పుడు అతని స్టేజ్ ఏంతో స్థానిక రెవెన్యూ, పోలీస్ ఇతర డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై క్షేత్రn స్థాయి పరిసీలన చేసి ఈ లాంటి దొంగ బాబాలను భారతం పట్టాలని స్థానికుల, బాధిత మహిళలు, ప్రజలు కోరుకుంటున్నారు. పరారైన దొంగ బాబా (పలికీల.రాము) ను ఎక్కడకి వెళ్లాడో అసలు అతని అస్తుల వివరాలు తెలుసుకొని ఈ ప్రజల ముందు తెలియజేయ వలసినదిగా అధికారులను కోరుతున్నాం. అని హనుమంతునాయుడు పేట పంచాయితీ వాసులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.